బాబోయ్ తల్లిగర్భంలోనే ఇలా కిక్‌బాక్సింగ్‌ ఆడుకుంటున్నారేంటి..?(వీడియో)

బాబోయ్ తల్లిగర్భంలోనే ఇలా కిక్‌బాక్సింగ్‌ ఆడుకుంటున్నారేంటి..?(వీడియో)
x
Highlights

తోడపుట్టిన అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ళు కొట్టుకోవడం చూశాం. అది బయట. కానీ ఈ వీడియో చూస్తే ఇదేమి అద్భుతమూ అని అనిపించకమానదు. సహజంగా కవలపిల్లలు...

తోడపుట్టిన అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ళు కొట్టుకోవడం చూశాం. అది బయట. కానీ ఈ వీడియో చూస్తే ఇదేమి అద్భుతమూ అని అనిపించకమానదు. సహజంగా కవలపిల్లలు కొట్టుకోవడం చూసుంటారు.. కానీ తల్లిగర్భంలోనే చేతులతో కిక్‌బాక్సింగ్‌ ఆదుకోవడం ఎక్కడా చూసి ఉండరు. చైనాలో అదే జరిగింది. అందుకు రుజువు ఈ వీడియోనే పిండాల దెబ్బలాటకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. చైనాకు చెందిన ఓ మహిళ నాలుగో నెలల గర్భంతో ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు.

ఈ సమయంలో తల్లి గర్భంలో ఉన్న ఇద్దరు కవలలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ కనబడ్డారు. అంతే స్కానింగ్ వైపు చూసిన ఆ మహిళ భర్త షాక్ కు గురయ్యాడు. ఇదేమి అద్భుతం అనుకుంటూ.. ఈ దృశ్యాన్ని తన ఫోన్ లో రికార్డు చేశాడు. అది డాక్టర్లకు చూపించడంతో వారు తమకిందంతా మామూలే అనుకుని వదిలేశారు. అయితే ఈ వీడియో అతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజెన్లు వీరు ఖచ్చితంగా బాక్సర్లే అవుతారు అని కామెంట్లు చేస్తున్నారు. ఓసారి మీరు కూడా ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories