Earthquake: ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో భూకంపం

Tsunami Warning to Pondaguitan Due to Earthquake In Philippines
x
ఫిలిప్పీన్స్ లో భారీ భూ కంపం (ఫైల్ ఇమేజ్)
Highlights

Earthquake: రిక్టర్‌ స్కేల్‌పై 7.1 భూకంప తీవ్రత * పొందగిటాన్‌కు 63 కి.మీ దూరంలో ప్రకంపనలు

Earthquake: ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్‌ జియోలాజిక్‌ సర్వే తెలిపింది. 65.6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్‌ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఫిలిప్పీన్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆప్‌ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.

మరోవైపు.. ఫిలిప్పీన్స్‌ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో బిల్డింగ్‌లు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఓ బిల్డింగ్ గేట్ దగ్గర నిదురిస్తున్న సునకం భూకంప తీవ్రతకు ఉలిక్కి పడింది. అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నించినా గేటుకు కట్టేయడంతో పెద్దగా అరుస్తూ యజమానులను అలర్ట్ చేసింది. మరోచోట.. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలు నీటిమీద తేలినట్లే ఊగిసలాడాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories