Donald Trump: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

Trump wins New Hampshire primary
x

Donald Trump: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

Highlights

Donald Trump: ప్రైమరీ ఎన్నికల్లో 55.5 శాతం ఓట్లతో ట్రంప్ విజయం

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆదేశ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది. న్యూ హాంప్‌ షైర్‌లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్‌ ఘన విజయం సాధించారు. ట్రంప్‌ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో, ట్రంప్‌ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు.

ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో.. రిపబ్లికన్‌ పార్టీలో పోటీ అంతా ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్‌ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌లు బరినుంచి వైదొలగారు. పోటీ నుంచి వైదొలగడంతో... రామస్వామి, డిశాంటిస్‌లు ట్రంప్‌ వైపు మద్దతు ప్రకటించారు.

ఇక హ్యాంప్‌ షైర్‌ గవర్నర్‌ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు 55.5 శాత ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41 వేల 423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36 వేల 83 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. ఇదిలా ఉండగా, అంతకుముందు.. అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు.

ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అయితే.. ప్రతిపక్షం నుంచి. అధ్యక్ష రేసులో ట్రంప్ చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories