శ్రీలంక పర్యాటకంపై పెద్ద దెబ్బ

శ్రీలంక పర్యాటకంపై పెద్ద దెబ్బ
x
Highlights

ఈస్టర్‌ పర్వదినం... శ్రీలంక అంతటా చర్చిల్లో ఉదయపు ప్రార్థనలు జరుగుతున్నాయి. అంతలోనే ధన్‌ ధనాధన్. కొలంబోలోని చర్చ్‌లు, 3 హోటళ్లు సహా మొత్తం 8...

ఈస్టర్‌ పర్వదినం... శ్రీలంక అంతటా చర్చిల్లో ఉదయపు ప్రార్థనలు జరుగుతున్నాయి. అంతలోనే ధన్‌ ధనాధన్. కొలంబోలోని చర్చ్‌లు, 3 హోటళ్లు సహా మొత్తం 8 ప్రాంతాల్లో బాంబులు పేలాయి. దీంతో 207 మంది మృత్యువాతపడ్డారు. అలాగే 450 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. బాంబు పేలుళ్లలో దాదాపు 40 మంది వరకు విదేశీయులు మృతిచెందారు. కాగా పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో భయానక వాతావరణం ఏర్పడింది. ఇదిలావుంటే పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులు, చైనీయులు అధికంగా ఉంటారు. దాడుల నేపథ్యంలో టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం అయ్యాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్‌ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడంతో పర్యాటక స్పాట్ లు అన్ని మూసేసి ఆలోచనలో శ్రీలంక ప్రభుత్వం ఉంది. పరిస్థితి యాధస్థితికి వచ్చిన తరువాత కానీ పర్యాటక స్పాట్ లు తెరవవద్దని లంక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories