ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బాంబుల వర్షం.. స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లపై...

Russia not Obeying International Court of Justice Orders | Russia Ukraine War Live Updates
x

ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బాంబుల వర్షం.. స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్లపై...

Highlights

Russia - Ukraine War: ఐసీజే ఆదేశాలను ఖాతరు చేయని రష్యా

Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.., ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ‌్యంలోనే ఉక్రెయిన్‌పై దాడుల్ని తీవ్రతరం చేస్తామని అంటోంది రష్యా. తాము అనుకున్నట్లుగానే ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తున్నాయి పుతిన్ సేనలు.

జనావాసాలపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఓ మున్సిపల్ స్విమ్మింగ్‌పూల్ కాంప్లెక్స్‌పై రష్యా బాంబుల మోత మోగించింది. దీంతో భవనం కుప్పకూలింది. దాడి సమయంలో కాంప్లెక్స్‌లో గర్భిణులు, చిన్నారులు కూడా ఉండగా.. ఈ ఘటనలో 21 మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు స్విచ్ బ్లేడ్ ఆత్మాహుతి డ్రోన్లను అందజేస్తామని అమెరికా ప్రకటించింది.

ఖార్కివ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి రష్యా దళాలు వారం రోజులుగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయు దాడులతో రష్యా విరుచుకుపడుతోంది. దీంతో ఈ నగరంలోని చాలా భాగం ధ్వంసమైంది. అలాగే ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో పురోగతిపై వస్తున్న వార్తలను కూడా రష్యా ఖండించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories