Modi- Putin: పుతిన్‌- మోదీ ఫోన్‌ సంభాషణ.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

Putin-Modi Phone Conversation
x

Modi- Putin: పుతిన్‌- మోదీ ఫోన్‌ సంభాషణ.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

Highlights

Modi- Putin: ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Modi- Putin: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు తామిద్దరం అంగీకరించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌, రష్యాల మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ సానుకూల పరిణామాలపై చర్చించినట్టు ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘బ్రిక్స్‌ కూటమికి మాస్కో నాయకత్వం సహా వివిధ ప్రాంతీయ, ప్రపంచ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నట్టు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇరుదేశాల మధ్య ఇటీవలి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై పురోగతిని నేతలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ‘బ్రిక్స్‌’కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రష్యాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. భారత్‌ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. ప్రధాని మోదీ తమ దేశంలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు పుతిన్ ఆ సందర్భంగా తెలిపినట్టు తెలుస్తుంది.

దాదాపు రెండేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నప్పటికీ.. భారత్‌తో మాత్రం రష్యా సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఆచితూచి అడుగులు వేస్తోన్న భారత్.. దౌత్యం, సంప్రదింపుల ద్వారానే సమస్యకు ముగింపు పలకాలని ఇరుదేశాలకు సూచిస్తోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తోంది. ఐరాసలో ఉక్రెయిన్‌ అనుకూల తీర్మానాల విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడి తట్టుకొని స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా.. మాస్కో- దిల్లీల మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని పుతిన్‌ కూడా స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories