Israel Hamas: నరమేధానికి నెల రోజులు.. 11 వేల మంది మృతి

One Month of Israel-Hamas War Death Toll Crosses 10000
x

Israel Hamas: నరమేధానికి నెల రోజులు.. 11 వేల మంది మృతి

Highlights

Israel Hamas: యుద్ధాన్ని కవర్ చేస్తున్న 27 మంది జర్నలిస్టుల మృతి

Israel Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రారంభమై సరిగ్గా నెల రోజులు పూర్తయింది. ఈ యుద్ధం ఇరువైపులా కన్నీటినే మిగిల్చింది. గాజాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించగా.. ఇజ్రాయెల్‌ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధంలో 10 వేల మంది దాకా పాలస్తీనియన్లు దుర్మరణంపాలయ్యారని, వారిలో దాదాపు అయిదు వేల మందిచిన్నారులున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. 70శాతం పాలస్తీనియన్లు నిరాశ్రయులైనట్లు ఐక్య రాజ్య సమితివెల్లడించింది.

ఇజ్రాయెల్‌లో మరణాల సంఖ్య 1,400గా ఉండగా.. 240 మంది హమాస్‌ చెరలో ఉన్నారు. లెబనాన్‌లో 380 మరణాలు నమోదయ్యాయి. గాజాలో యుద్ధాన్ని కవర్‌ చేస్తున్న 27 మంది జర్నలిస్టులు కూడా మృతి చెందారు. . మంగళవారం తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో వఫా న్యూస్‌ ఏజెన్సీ జర్నలిస్టు మహమ్మద్‌ అబూ హసీరా, అతను కుటుంబ సభ్యులు మృతిచెందారు. కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం డిమాండ్‌ చేస్తున్నా.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాత్రం పట్టించుకోవడంలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories