Myanmar: మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌ సూకీకి జైలు

Myanmars Aung San Suu Kyi Handed Five-Year Jail Term for Graft
x

Myanmar: మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌ సూకీకి జైలు

Highlights

Myanmar: సూకీపై 11 అవినీతి ఆరోపణలు చేసిన సైనిక ప్రభుత్వం

Myanmar: మన పొరుగు దేశం మయన్మార్‌ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. సూకీపై మోపిన 11 అవినీతి కేసుల్లో విచారణలో భాగంగా జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్లు, నగదును, 11 కిలోల బంగారాన్ని లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. అందుకు సూకీకి ఐదేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కావడం గమనార్హం. మిగిలిన పది కేసులపైనా విచారణ సాగుతోంది. వాటిలోనూ ఆమె దోషిగా నిర్ధారణ అయితే.. అమెకు మరిన్ని శిక్షలు పడే అవకాశం ఉంది.

నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ- ఎన్ఎల్డీ పార్టీ చైర్ పర‍్సన్‌గా ఉన్న ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్లపాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం ఆమె పోరాటం చేశారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం మొదటి నుంచి సూకీ పోరాడుతోంది. అందులో భాగంగానే ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. అయితే ఏడాది క్రితం సైన్యం ప్రభుత్వాన్ని అదుపులోకి తీసుకుంది. ఆమెకు మళ్లీ గృహ నిర్బంధం విధించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. అయినా అక్కడి సైనిక ప్రభుత్వం వారిని కఠినంగా అణిచివేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories