యుద్ధ భూమిగా పశ్చిమాసియా.. సిరియాపై జోర్డాన్ వైమానిక దాడులు

Jordan Attack On Syria
x

యుద్ధ భూమిగా పశ్చిమాసియా.. సిరియాపై జోర్డాన్ వైమానిక దాడులు

Highlights

Syria: యెమెన్‌లోని హూతీ రెబల్స్‌పై అమెరికా దాడి

Syria: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో సిరియా, జోర్డాన్, ఇజ్రాయెల్, గాజా, యెమెన్ దేశాల్లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్యంగా సిరియాపై గురువారం జోర్డాన్‌ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇటు యెమెన్‌లోని హూతీ రెబల్స్‌పై అమెరికా దాడులకు దిగింది.

సిరియాలోని స్వైదా ప్రావిన్సులో ఉన్న ఆర్మాన్‌ గ్రామంపై జోర్డాన్‌ వైమానిక దాడి చేసింది. ఇందులో మరణించిన 9 మందిలో ఇద్దరు చిన్నపిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. డ్రగ్‌ స్మగ్లర్లే లక్ష్యంగా జోర్డాన్‌ వైమానిక దళం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే దాడుల్లో చనిపోయిన వారికి ఏ మాత్రం డ్రగ్స్‌తో సంబంధం లేదని బ్రిటన్‌ కేంద్రంగా పని చేసే సిరియా మానవ హక్కుల ప్రతినిధి రమీ అబ్దుర్రహ్మాన్‌ తెలిపారు. సిరియా నుంచి జోర్డాన్‌ మీదుగా గల్ఫ్‌ దేశాలకు డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేయడం ఏడాది కాలంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే జోర్డాన్‌ ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories