ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులకు ఉద్యోగాలు

Jobs for 6,000 Indian workers in Israel
x

ఇజ్రాయెల్‌కు 6,000 మంది భారత కార్మికులకు ఉద్యోగాలు

Highlights

Israel: విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తున్న ఇజ్రాయిల్

Israel: హమాస్‌తో ఘర్షణల వల్ల ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగాన్ని కార్మికుల కొరత వేధిస్తోంది. దీంతో విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా భారత్‌ నుంచి 6000 మంది అక్కడికి చేరుకోనున్నారు. ఏప్రిల్‌, మేలో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరిని తరలించనున్నారు. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. స్థానికుల కొరత ఉన్నచోట ఇజ్రాయెల్‌ నిర్మాణరంగం విదేశీ కార్మికులను నియమించుకుంటోంది. ఇప్పటి వరకు పాలస్తీనా అధీనంలోని వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి 80,000, గాజాకు చెందిన 17,000 మంది అక్కడ పనిచేస్తుండేవారు. కానీ, తాజాగా ఘర్షణల నేపథ్యంలో వారికి పని అనుమతిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ సహా పలు దేశాల నుంచి కార్మికులను ఆ స్థానాల్లో ఆహ్వానిస్తోంది.---

హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్‌లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కార్మికుల కొరతే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ఉపాధిలేక జీవన వ్యయాలు పెరిగాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాతే కార్మికుల తరలింపు నిర్ణయం వెలువడింది. భారత్‌-ఇజ్రాయెల్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందంలో భాగంగానే ఇక్కడి కార్మికులను తీసుకెళ్లనున్నారు.

గతకొన్ని నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం మరో 64 మంది అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ దాదాపు 20,000 మంది భారత, శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చిందని అక్కడి నిర్మాణ రంగం తెలియజేసింది. వారిలో కేవలం వెయ్యి మంది మాత్రమే అక్కడికి చేరుకున్నట్లు వెల్లడించాయి. కానీ, వివిధ రకాల అనుమతులు, అధికారిక పత్రాల విషయంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంపికైన వారిలో చాలా మంది శ్రామికులు తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి వేచిచూస్తున్నారని తెలిపారు. డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో భారత కార్మికులకు అవకాశాలు సుగమమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories