ఈనెల 16-20 తేదీల మధ్య మాపై భారత్ దాడి చేస్తుంది : పాక్ మంత్రి సంచలనం

ఈనెల 16-20 తేదీల మధ్య మాపై భారత్ దాడి చేస్తుంది : పాక్ మంత్రి సంచలనం
x
Highlights

జమ్మూకశ్మీర్‌ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌ పై జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి...

జమ్మూకశ్మీర్‌ పూల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌ పై జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాది తనను తాను పేల్చుకొని 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అయిన బాలకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. ఈ దాడిలో సుమారు 300 మంది ఉగ్రవాదులు దాకా మరణించారు. అయితే ఇంతమందిని చంపినా భారత సైనికుల గుండెమంట చల్లారలేదు.

ఉగ్రవాదులను ఎక్కడ దొరికితే అక్కడ ఏరిపారేస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన పాక్ ప్రభుత్వం భారత్ పై ఆరోపణలదాడికి దిగుతోంది. ఈ నెల 16-20 తేదీల మధ్య మా దేశంపై దాడి చేసేందుకు భారత్‌ పథకం పన్నుతోందని, ఈ విషయమై తమకు విశ్వసనీయమైన నిఘా సమాచారముందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముల్తాన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ మాపై దాడికి దిగబోతోందని అన్నారు. దౌత్యపరంగా ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ ఈ దాడికి పూనుకుంటోందని ఆరోపణలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories