Hindu Temples: ముస్లిం దేశాలలో హిందూ ఆలయాలు ఉన్నాయి.. పూజలు కూడా చేస్తారు..!

Hindu Temples in Muslim Countries
x

Hindu Temples: ముస్లిం దేశాలలో హిందూ ఆలయాలు ఉన్నాయి.. పూజలు కూడా చేస్తారు..!

Highlights

Hindu Temples: ఓమన్‌, ఇరాన్‌, బహ్రెయిన్, పాక్‌లోనూ మందిరాలు

Hindu Temples: 100 పర్సెంట్‌ ముస్లిం దేశం.. ఇస్లాం విధానాలను పక్కగా పాటిస్తారు. అలాంటి దేశాల్లోనూ హిందుత్వానికి పెద్ద పీట పడుతోంది. తాజాగా గల్ప్‌ తీరంలోని అబుదాబీలో స్వామీ నారాయణ్‌ మందిరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముస్లిం రాజ్యంలో హిందూ టెంపుల్‌ సగర్వంగా హిందుత్వాన్ని చాటుతూ ఠీవీగా నిలుస్తోంది. అయితే ముస్లిం దేశాల్లో ఇదొక్కటే ఆలయం ఉందా? మరే ముస్లిం దేశాల్లో ఆలయాలు లేవా? అంటే.. చాలా ముస్లిం దేశాల్లో మందిరాలు ఉన్నాయి. పశ్చిమ, తూర్పు ఆసియా ముస్లిం దేశాల్లో ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. అక్కడి భక్తులు నిత్యం ఆయా ఆలయాలకు వెళ్లి.. పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఏయే దేశాల్లో హిందూ ఆలయాలు ఉన్నాయి? అవి ఇటీవల కాలంలో కట్టినవా? లేక పురాతన కాలం నుంచి ఉన్నాయా? వాచ్ దిస్‌ స్టోరీ.

పాకిస్థాన్.. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమిది. కానీ.. ఆ దేశంలోనూ ఇతర మతాల ప్రజలు ఉన్నారు. అయితే తీవ్రవాద ఇస్లామిస్ట్‌ భావాలున్న కొందరు దుండుగలు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎంతో పురాతన, చారిత్రక మందిరాలను పాకిస్థాన్‌‌లో కూలగొట్టారు. పాకిస్థాన్‌‌లో మొత్తం 4,280 హిందూ ఆలయాలు ఉండేవని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలుసా? కేవలం 380 మందిరాలు మాత్రమే ఉన్నాయి. మిగతావాటిని ముస్లింలు కూల్చేశారు. పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలను కూల్చడం ట్రెండ్‌గా మారింది. నిజానికి ఆలయాలను పరిరక్షించి ఉంటే.. అవి పర్యాటక ప్రాంతాలుగా మారేవి. దుర్బుద్దితో కూడిన పాకిస్థాన్‌‌కు ఆలయాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలన్న ధ్యాస లేకుండా పోయింది. తన కన్నా చిన్న దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌-యూఏఈని చూసి.. పాకిస్థాన్ సిగ్గుపడాలి. అరబ్‌ కంట్రీస్‌లోకెల్లా అతి పెద్ద ఆలయ నిర్మాణానికి యూఏఈ అనుమతించింది. ఇప్పుడు అబుదాబీలో స్వామీ నారాయణ్‌ టెంపుల్‌ నిటారుగా నిలిచి.. హిందుత్వాన్ని సగర్వాంగా చాటుతోంది. ఇది ఇండియా-యూఏఈ గర్వించదగిన విషయం. అంతేకాదు.. భారత్‌-యూఏఈ దేశాల మధ్య మతపరమైన సామరస్యానికి ప్రతీకగా స్వామి నారాయణ్‌ టెంపుల్‌ నిలుస్తోంది. తాజాగా అబుదాబీలోని భారీ హిందూ ఆలయాన్ని మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. స్వామి నారాయణ్‌‌కు పూజలు నిర్వహించి.. హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించే పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇస్లాం జన్మస్థలమైన అరేబియా ద్వీపకల్పంలో దశాబ్దాలుగా హిందూ ఆలయాలు ఉన్నాయి. అయితే అబుదాబీలోని స్వామీ నారాయణ్‌ ఆలయం మాత్రం ప్రత్యేకమైనది. ఇది పశ్చిమ ఆసియాలోనే ఇసుక రాతితో నిర్మించిన మొట్టమొదటి హిందూ ఆలయం ఇదే. వెస్ట్‌ ఆసియాలోని ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా.. అబుదాబిలోని స్వామి నారాయణ్‌ టెంపుల్‌ భారత్‌లోని ఆలయాల శైలిలో నిర్మించబడింది. అంతేకాదు.. ఈ ఆలయానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అబుదాబీ ఆలయం రాజకీయాలకు అతీతమైనదిగా స్వామి నారాయణ్‌ మందిరానికి చెందిన పూజ్య బ్రహ్మవిహారీ స్వామి వెల్లడించారు. ఈ ఆలయం హిందూ మతానికి మాత్రమే కాకుండా.. అన్ని మతాల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని బ్రహ్మవిహారీ స్వామి చెప్పారు. అసలు విషయం ఏమిటంటే.. స్వామి నారాయణ్‌ ఆలయానికి భూమిని ముస్లిం రాజు విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయ ప్రధాన ఆర్కిటెక్ట్‌ క్రిస్టియన్ క్యాథలిక్‌. ఆలయ ప్రాజెక్ట్‌ డిజైనర్‌ షేక్, ఆలయ పౌండేషన్‌ డిజైనర్‌ బౌద్ధిస్ట్‌. ఆలయ నిర్మాణానికి సహాయం చేసిన సంస్థ పారసీకి చెందినది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇసుక రాయిని భారత్‌లోని రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు.

ఇక బహ్రెయిన్‌‌లో 1817లో తతై హిందూ కమ్యూనిటీ శ్రీనాథ్‌జీ మందిరాన్ని నిర్మించింది. 200 ఏళ్లకు పైగా బహ్రెయిన్‌ రాజధాని మనమా నగరంలో ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఇది కాకుండా మరో ప్రసిద్ధ ఆలయం శ్రీకృష్ణ దేవాలయం కూడా బహ్రెయిన్‌లో ఉంది. ఇక యూఏఈలో హిందూవులు మూడో అతి పెద్ద మత సమూహంగా ఉన్నారు. అబుదాబీలోని తాజా స్వామి నారాయణ్‌ మందిరంతో పాటు మరో రెండు ఆలయాలు ఉన్నాయి. దుబాయ్‌లోని శివకృ‌ష్ణ మందిరం ఉంది. దీన్ని 1958లో నిర్మించారు. ఇక మరొక ఆలయం దుబాయ్‌లోని జబెల్‌ అలీ గ్రామంలో ఉంది. ఇది సిక్‌ గురుద్వారాకు పక్కనే ఉంది. సమీపంలో చర్చి కూడా ఉంది. ఈ ఆలయం 2022లో ప్రారంభమైంది. ఇక ఇరాన్‌‌లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. బందర్‌ అబ్బాస్‌లోని చారిత్రక స్మారక చిహ్నంగా విష్ణు దేవాలయం ఉంది. 1892లో బ్రిటిష్‌ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం పని చేస్తున్న భారతీయ సంఘం నిర్మించినట్టు తెలుస్తోంది. పశ్చిమ ఆసియా నుంచి మళ్లితే.. భారత్‌, పాకిస్థాన్ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. పొరుగు దేశంలో ఒకప్పుడు 4వేల 280కి పైగా హిందూ ఆలయాలు ఉండేవి. అందులో అతి పెద్దది హింగ్‌లాస్‌ ఆలయం ప్రధానమైనది. ఇది సింధ్‌ ప్రావిన్స్‌లోని టాండో అలయార్‌లో ఉంది. వాస్తవానికి అనేక దేవాలయలో ఇది ఒకటి మాత్రమే. ఇక బంగ్లాదేశ్‌లో రెండో అతి పెద్ద మతం హిందుత్వమే. పాకిస్థాన్‌లాగే బంగ్లాదే‌శ్‌లోనూ వేలాది ఆలయాలకు నిలయం.

రాజధాని ఢాకాలోని ఉన్న ఢాకేశ్వరి ఆలయం ప్రధానమైనది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం. ఈ ఆలయంలో ఢాకా అమ్మవారు కొలువై ఉన్నారు. బంగ్లాదేశ్‌లోని అత్యంత కీలకమైన హిందూ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఏటా ఢాకేశ్వరి ఆలయాన్ని వేలాది మంది సందర్శిస్తారు. ఇక తూర్పున ఉన్న ముస్లిం కంట్రీస్‌లో మలేషియా ఒకటి. ఈ దేశ జనాభాలో హిందువులు 6.3 శాత మంది ఉన్నారు. ఈ దేశంలో చాలా ఆలయాలు బ్రిటిషర్లు రాకముందే నిర్మించినట్టు తెలుస్తోంది. దేశంలో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. మలేషియాలో ప్రధాన హిందూ ఆలయం మాత్రం శ్రీశక్తో దేశస్థానం. కోలా సాంగ్‌లో ఉన్న బటు గుహలకు కూడా హిందూ ఆలయాలకు నిలయం. భారత్‌ వెలుపల ఉన్న ప్రసిద్ధ హిందూ పుణ్య క్షేత్రాల్లో బటు గుహ సముదాయం అత్యంత కీలకమైనది. మరొక చిన్న ద్వీప దేశం బర్నియో. ఈ దేశంలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక మరో ముస్లిం దేశం బ్రూనైలో రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఓ ఆలయాన్ని బ్రూనే ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇది బ్రూనేలోని గూర్ఖా రెజిమెంట్‌ భూభాగంలో ఉంది. దీన్ని గూర్ఖా టెంపుల్‌ పీపుల్‌ అని పిలుస్తారు. సో.. శాతాబ్దాలుగా ముస్లిం దేశాల్లో అనేక గొప్ప హిందూ ఆలయాలు ఉనికిలో ఉన్నాయి. నిజానికి కొన్ని పురాతన ఆలయాలు ధ్వంసమై శిథిలావస్థకు చేరుకున్నాయి.

గతంలో అసాధ్యమని భావించిన ప్రదేశాల్లో కొత్త ఆలయాలు వెలుస్తున్నాయి. భారీ ఆలయాలకు ముస్లిం దేశాలు కూడా గ్రీన‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. ఈ పరిణామం సర్వమత సమ్మేళానికి నిదర్శనం. ఇది సంస్కృతి పరిరకషణ మాత్రమే కాదు.. ఇది భారతదేశ ఆలయ దౌత్యాన్ని కూడా సూచిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories