Dubai Rains: ఏడాదిన్నర వాన గంటల్లోనే.. జలమయమైన పలు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం

Heavy Rain Causes Flash Floods In Dubai
x

Dubai Rains: ఏడాదిన్నర వాన గంటల్లోనే.. జలమయమైన పలు ప్రాంతాలు, స్తంభించిన జనజీవనం

Highlights

Dubai Rains: బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు

Dubai: దుబాయ్‌ని అకాల వర్షాలు ముంచెత్తాయి. సాధారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కావడంతో అక్కడ వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటిది రెండు రోజలుగా యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ ఎక్కువగా కనిపించింది. దుబాయ్‌లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. ఒక్కరోజులోనే కొన్ని గంటల్లోనే నమోదైంది.

దుబాయ్‌లో రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దాంతో దుబాయ్‌లో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దుబాయ్‌లో రోడ్లపైకి వర్షపు నీరు రోడ్లపై పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేశారు. దుబాయ్‌కు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది ముంబై కాదు.. దుబాయ్ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదుగా కురుస్తాయి. అయితే గత 2-3 ఏళ్లుగా ఇలాగే కుంభవృష్టి కురుస్తోంది. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories