Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత..!

First Solar Eclipse of 2024 to take place today
x

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత..!

Highlights

Solar Eclipse: ఎన్నో ప్రత్యేకతలున్న నేటి సంపూర్ణ సూర్యగ్రహణం

Solar Eclipse: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం ఇవాళ ఏర్పడనుంది. నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఈ రోజు రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది. అయితే.. హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ముందు వచ్చే ఈ గ్రహణం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభప్రదంగా

చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. ఈ సూర్యగ్రహణం సూర్యగ్రహణం సంపూర్ణంగా ఉంటుంది. 54 సంవత్సరాల తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘంగా ఉండే గ్రహణం కాబోతోంది. దాదాపు ఐదుగంటల 25 నిముషాలు ఉంటుంది.

ఈ రోజు రాత్రి 9.12 గంటల నుంచి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. సూర్యగ్రహణం యొక్క మొత్తం వ్యవధి 4 గంటల 39 నిమిషాలు ఈ కాలంలో పాటించాల్సిన అనేక నియమాలు ఉన్నాయి. అయితో ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా గ్రహణ సమయం, ఇతర నియమాలు మనకు వర్తించవు. కానీ, కొంతమంది జ్యోతిష్య నిపుణులు పాటిస్తే మంచిదని చెబుతున్నారు. మరికొంత అసలు పట్టించుకోవలిసిన అవసరం లేదంటున్నారు..

భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. ఆ మరుసటి తెల్లవారుజామున రెండు గంటల 22 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. మెక్సికో, కెనడా, యూకే, ఐర్లాండ్ అమెరికా తదితర దేశాల్లో మాత్రమే ఈ సూర్య గ్రహణం కనిపించనుంది. వాతావరణ పరిస్థితులు అనుమతించినట్లయితే, మెక్సికోలోని మిలియన్ల మంది వ్యక్తులు, యునైటెడ్ స్టేట్స్‌లోని 15 రాష్ట్రాలు , తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాలు భూమి , సూర్యుని మధ్య చంద్రుడు కదులుతున్నప్పుడు, సూర్యుని కాంతిని క్షణికంగా అడ్డుకోవడంతో ఒక అద్భుతమైన సంఘటనను చూసే అవకాశం ఉంటుంది.

నేటి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంతో.. మెక్సికో, యూఎస్‌, కెనడా మధ్య 185 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆకాశం మొత్తం చీకటిగా మారుతుంది. అందుకే దీనిని టోటాలిటీ అని కూడా పిలుస్తారు. యూఎస్‌లో సుమారు 18 రాష్ట్రాలు కూడా దీనిని చూడవచ్చు. మొత్తం గ్రహణ సమయంలో కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే పూర్తిగా చీకటి అవుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA ప్రకారం.. గరిష్ట దృశ్యం మొత్తం చీకటి మార్గంలో 4 నిమిషాల 27 సెకన్ల వరకు ఉంటుందని నాసా చెబుతోంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడటం మంచిది కాదన్న విషయం తెలిసిందే. చూడాలనుకుంటే ప్రత్యేక సన్ గ్లాసెస్ తో చూడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories