France PM: ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల గే.. నియ‌మించిన అధ్య‌క్షుడు మాక్రాన్‌..!

First Gay PM in France
x

France PM: ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల గే.. నియ‌మించిన అధ్య‌క్షుడు మాక్రాన్‌..!

Highlights

France PM: మాక్రాన్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా గ్యాబ్రియెల్ అటల్‌

France PM: ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు నియమితుడయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గ్యాబ్రియెల్ అటల్‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. కొత్తగా ప్రధానిగా నియమితులైన గ్యాబ్రియెల్ అటల్ ఒక ‘గే’ కావడం మరో ఆసక్తి కర పరిణామం. త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది తీసుకొచ్చిన అన్ పాపులర్ పెన్షన్, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఎమ్మాన్యుయెల్. తన ప్రత్యర్థి మారిన్ లే పెన్స్ ముందు ఎమ్మాన్యుయెల్ ప్రజాదరణ కోల్పోయారు. ఆయన ప్రజాదరణ ఎనిమిది నుంచి పది శాతానికి పడిపోయింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో గ్యాబ్రియెల్ పరపతి క్రమంగా పెరుగుతున్నది.

ఈ నేపథ్యంలో జూన్ ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు గ్యాబ్రియెల్ అటల్’ను ప్రధానిగా నియమించినట్లు తెలుస్తున్నది. ఇక ప్రస్తుత ప్రధాని ఎలిసాబెత్ బోర్న్ స్థానంలో నియమితులైన గ్యాబ్రియెల్ అటల్.. కొవిడ్ మహమ్మారి ఉధ్రుతి వేళ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories