Donald Trump popularity Down: మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలు పది శాతం మాత్రమే!

Donald Trump popularity Down: మళ్ళీ ట్రంప్ గెలిచే అవకాశాలు పది శాతం మాత్రమే!
x
Highlights

Donald Trump popularity Down: నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ సర్వేల్లో పైచేయి సాధించారు.

Donald Trump popularity Down: నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ సర్వేల్లో పైచేయి సాధించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ట్రంప్ గెలిచే అవకాశాలు పది శాతం మాత్రమే ఉన్నాయని ఎకనామిస్ట్ ఎన్నికల నమూనా సూచించింది. జాతీయ అభిప్రాయ సేకరణలో ట్రంప్ తన ప్రత్యర్థి కంటే కొన్ని పాయింట్లు వెనకబడ్డారు. ప్రస్తుతం ఆయన చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. జో బిడెన్ తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సాధించాడని.. కొన్ని సర్వేలలో ఎక్కువ పెరుగుదల కూడా ఉందని తెలిపింది.

ఫ్లోరిడా, మిచిగాన్ మరియు విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ ఉంటుందని.. అయితే ఇది బిడెన్ కు అనుకూలంగా మారే పరిస్థితి ఉందని సర్వేలు పేర్కొంటున్నాయి. వృద్ధ ఓటర్లలో కూడా బిడెన్ కు బలమైన మద్దతు లభిస్తోంది. ఆశ్చర్యకరంగా, కాలేజీయేతర ఓటర్లు కూడా బిడెన్ కు మద్దతుగా ఉన్నట్టు సర్వేలు సూచిస్తున్నాయి. 74 ఏళ్ల ట్రంప్ అధ్యక్ష పదవికి అసమర్థుడని కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని పెద్దవారిలో అభిప్రాయం ఉంది.

నవంబర్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, రాబోయే రోజుల్లో ట్రంప్ అవకాశాలు మెరుగుపడవచ్చు. ఒకవేళ వైరస్ యొక్క తీవ్రమైన వ్యాప్తి కొనసాగితే మాత్రం పోస్ట్ ద్వారా ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనికి తగినంత సదుపాయాలు లేనందున తక్కువ ఓటింగ్ కారణంగా పోటీ అనూహ్యంగా మారుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories