US Elections: మార్చిలో బైడెన్‌కు ₹750 కోట్లు.. ట్రంప్‌నకు ఒక్కరోజే ₹420 కోట్ల విరాళాలు

Biden And Democrats Report Raising 90 Million Plus Dollars In March
x

US Elections: మార్చిలో బైడెన్‌కు ₹750 కోట్లు.. ట్రంప్‌నకు ఒక్కరోజే ₹420 కోట్ల విరాళాలు

Highlights

US Elections: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ పోటీ విరాళాలు

US Elections: రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్‌, ట్రంప్‌ ప్రచార బృందాలు పోటా పోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్‌ గత నెలలో 750 కోట్లు సమీకరించగా.. ట్రంప్‌ ఒక్క కార్యక్రమంలోనే 420 కోట్లు సేకరించడం గమనార్హం. మార్చిలో 90 మిలియన్‌ డాలర్లకు పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 192 మిలియన్‌ డాలర్ల నిధులు తమ చేతిలో ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపునవేనని తెలిపింది.

మార్చి 28న రెడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్ బృందం వెల్లడించింది. తమకు వస్తున్న విరాళాలతోనే డిజిటల్‌, టీవీ ప్రకటనలు ఇస్తున్నామని తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకూ వీటిని వినియోగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 నాటికి తమ వద్ద ఉన్న 192 మిలియన్‌ డాలర్ల విరాళాలు ఇప్పటివరకు ఏ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి అందుకోలేదని చెప్పింది. 2023 ఏప్రిల్‌లో బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించినప్పటి నుంచి 16 లక్షల మంది విరాళాలిచ్చినట్లు తెలిపింది. మార్చిలో అధ్యక్షుడి కీలక స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగం తర్వాత 24 గంటల్లో 10 మిలియన్‌ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories