Bangladesh Supreme Court: వార్షిక సెలవులను రద్దు చేసిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు

Bangladesh Supreme Court: వార్షిక సెలవులను రద్దు చేసిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు
x
Bangladesh Supreme Court
Highlights

Bangladesh Supreme Court: కోవిడ్-19 మహమ్మారి కారణంగా కోల్పోయిన సమయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు..

Bangladesh Supreme Court: కోవిడ్-19 మహమ్మారి కారణంగా కోల్పోయిన సమయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం తన వార్షిక సెలవులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 6 న ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ మహమూద్ హుస్సేన్, హైకోర్టు విభాగాల న్యాయమూర్తుల మధ్య జరిగిన ఈ సమావేశంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎండి అలీ అక్బర్ సంతకం చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోర్టు క్యాలెండర్ ప్రకారం, ఆగస్టు 31 నుండి అక్టోబర్ 5 వరకు మరియు అక్టోబర్ 23-27 వరకు సెలవులు నిర్ణయించబడ్డాయి. మరో సెలవుదినం డిసెంబర్ 18-31 తేదీలలో జరగాల్సి ఉందని తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి బంగ్లాదేశ్ మార్చి 26 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసిన విషయం తెలిసిందే. తరువాత దానిని మే 30 వరకు పొడిగించింది. సుప్రీంకోర్టు తరువాత దేశంలోని అన్ని కోర్టులలో సాధారణ సెలవు దినంగా ప్రకటించింది, దీనిని మే 30 వరకు పొడగించిన విషయం కుడా తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories