బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనా..!

బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనా..!
x
Highlights

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభ ఫలితాల్లో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్‌ పార్టీ మళ్ళీ అధికారం దిశగా...

బంగ్లాదేశ్‌ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభ ఫలితాల్లో ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నేతృత్వంలోని పాలక అవామీ లీగ్‌ పార్టీ మళ్ళీ అధికారం దిశగా వెళుతోంది. ఆ పార్టీ 75 స్ధానాల్లో ముందంజలో ఉండగా విపక్ష బీఎన్‌పీ కేవలం మూడు స్ధానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది.

అలాగే జతియో పార్టీ ఒక స్ధానంలో ఆధిక్యంలో ఉంది. దీంతో హసీనా సారథ్యంలో మళ్లీ అవామీ లీగ్‌ విజయం దాదాపు ఖాయమైంది. రేపు ఉదయానికల్లా స్పష్టమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం హింసాత్మక ఘటనల నడుమ ముగిసింది. ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లలో 12 మంది మరణించారు. రాజ్‌షాహి, చిత్తగావ్‌, కుమిల్లా, కాక్స్‌బజార్‌, బ్రమ్మణబెరియా, రంగమతి, నార్సిది, బొగుర, గజీపూర్‌, సిల్హెట్‌లో చెలరేగిన అల్లర్లలో పలువురు మరణించారు. మృతుల్లో అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలే అధికంగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.బంగ్లా ప్రధానిగా మళ్లీ హసీనా..!

Show Full Article
Print Article
Next Story
More Stories