అమెరికాలో అరుదైన ‘ఫైర్నాడో’..!

A Fire With A Tornado Seen In America
x

అమెరికాలో అరుదైన ‘ఫైర్నాడో’..!

Highlights

America: టోర్నడో కలిసి అత్యంత అరుదుగా కనిపించే ఫైర్నాడో

America: అసలే కార్చిచ్చు.. ఆపై సుడిగాలితో కలిసి భగభగలాడే అగ్నిగోళంలా ఆ ప్రాంతాన్ని చుట్టేస్తే.. ఇలాంటి దృశ్యమే అమెరికాలోని లూసియానాలో ఆవిష్కృతమైంది. ఇక్కడి సబినే పారిష్‌లో కార్చిచ్చుతో టోర్నడో కలిసి.. అత్యంత అరుదుగా కనిపించే ఫైర్నాడోగా మారింది. అంతే వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కదులుతూ అక్కడివారిని వణికించేసింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా బలహీనపడింది. ఈ దృశ్యాన్ని కొందరు చిత్రీకరించారు.

లూసియానాలో వ్యాపిస్తున్న కార్చిచ్చుపై లూసియానా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫిషరీస్‌ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి స్థానికులకు పెనుముప్పుగా మారాయన్నారు. దీనికితోడు ఇటీవలి కాలంలో చాలా మందిని కార్చిచ్చులను దగ్గర చూసేందుకు ప్రయత్నించడమో.. డ్రోన్లను పంపడమో చేస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. తమ విమానాలు అక్కడ పనిచేస్తుంటాయని, ప్రజలు అదే మార్గంలో డ్రోన్లను పంపిస్తున్నారని పేర్కొన్నారు.

మరోవైపు టెక్సస్‌లోని హంట్స్‌ వెల్లీలో కార్చిచ్చు భీకరంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే అక్కడ 3 వేల ఎకరాల అడవి కాలిపోయింది. ఇక్కడ రోజుకు సగటున 100 ఎకరాల అడవి దగ్ధమవుతోంది. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories