Joe Biden VS Donald Trump: నవంబర్‌లో బైడెన్, ట్రంప్ మధ్య పోరు

A Battle Between Joe Biden And Donald Trump In November
x

Joe Biden VS Donald Trump: నవంబర్‌లో బైడెన్, ట్రంప్ మధ్య పోరు 

Highlights

Joe Biden VS Donald Trump: నవంబర్ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచదేశాలు

Joe Biden VS Donald Trump: కురవృద్ధులు అనే పదానికి వారిద్దరూ సరిగ్గా సరిపోతారు. ప్రపంచానికే పెద్దన్న వంటి అమెరికాకు ఆ ఇద్దరు అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 50 ఏళ్లకు పైగా అమెరికా రాజకీయాలను మాత్రమే కాదు.. ప్రపంచ రాజకీయాలను క్షుణంగా చూసిన రాజకీయా మేధోసంపత్తి వారి సొంతం. ఇప్పుడు ఆ ఇద్ధరు వృద్ధ రాజకీయ మేదావులు తలపడబోతున్నారు. నవంబర్‌లో జరిగే అమెరికా ఎన్నికల కోసం ఇప్పుడు ప్రపంచమే ఎదురుచూస్తోంది. ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తలపడుతుండటమే దానికి కారణం. మరి ఈ ఇద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికున్నాయి? ఈ సారి విజయం ఎవరిని వరించబోతుంది? లెట్స్ వాచ్...

నవంబర్.. అమెరికాకు మాత్రమే కాదు. ప్రపంచానికే ఈ నెల ఎంతో కీలకం కాబోతుంది. ముఖ్యంగా యుద్ధాలతో సతమతమవుతున్న పాలస్తినా.. ఉక్రెయిన్ వంటి దేశాలు ఈ ఎన్నికలనే నమ్ముకుని ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇటు అమెరికా తర్వాత అతిపెద్ద ఆయుద్ధ సంపత్తి కలిగిన దేశాలు, అమెరికాను కిందకు లాగి పెద్దన్న పెత్తనం చెలాయించాలని చూస్తున్న చైనా, రష్యా వంటి దేశాలు కూడా ఆ నవంబర్ నెల కోసమే ఎదురుచూస్తున్నాయి. ప్రెసిడెంట్ బైడెన్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ తలపడుతుండటంతో వీరిలో ఎవరు గెలిచినా... ప్రపంచవ్యాప్తంగా ఆప్రభావం ఉండనుంది. దీంతో దేశాల చూపులన్నీ ఇప్పుడు అమెరికాపైనే కేంద్రీకృతమై ఉన్నాయి.

రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు. ఈ గుర్తుకు ఏమాత్రం తీసుపోనన్నట్లుగా మదగజంలా దూకుడు మీదుంటారు ట్రంప్. ట్రంప్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుకుంటే అయిపోవాలి. కాదంటే లేపేయాలి. ఇదీ ట్రంప్ స్టైయిల్. ట్రంప్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లో సంచలన నిర్ణయాలతో ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. మిత్రులు,శత్రువులన్న తేడా లేకుండా అమెరికాకు అడ్డువచ్చినా.. అడ్డుచెప్పినా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. దూకుడుకు ప్రదర్శించారు. ఆ దూకుడే ఆయన్ను అధ్యక్షపదవిని కోల్పోయేలా చేసింది. అయితే నాలుగేళ్ల బైడెన్ పరిపాలన తర్వాత ఇప్పుడు ఆ దూకుడే కావాలంటోంది అమెరికా.

కరోనా కబలించిందన్న కారణంతో... ట్రంప్‌ను పక్కనపెట్టారు అమెరికా ప్రజలు. దూకుడు నిర్ణయాలతో దేశ సమగ్రతకే ప్రమాదమని.. అప్పట్లో మేధావులు కూడా ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే...ఇప్పుడు ఆ ట్రంపే కావాలని మెజార్టీ అమెరికా ప్రజలు కోరుకుంటున్నారు. తమ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళతాం కాని వెనుదిరగమని బలంగా బదులివ్వాలంటే ట్రంప్ ఉంటేనే కరెక్ట్ అని అమెరికా ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్ కూడా అమెరికా ప్రజలు నాడిని పట్టుకున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రచారం నిర్వహిస్తూ... అసమర్థ డెమొక్రట్ల పాలనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

విదేశీ విధానం సరిగ్గా లేకపోవడం వల్లే... ప్రపంచం ముందు అమెరికా పరువు పోతుందని ప్రస్తుత ప్రభుత్వంపై ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఉద్యోగాలన్నీ అమెరికన్లేకే అంటూ విదేశీయుల గుండేల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. వలసదారులను ఉపేక్షించేది లేదని.. మరోసారి రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి...అమెరికాలో విదేశీల పెత్తనాన్ని అంతమొందిస్తామని అంటున్నారు. అయితే ట్రంప్ ఇంత బలంగా తయారవడానికి కారణం బైడెన్ విధానాలే అంటున్నారు విశ్లేషకులు. ఇబ్బడి ముబ్బడిగా విదేశీలకు ‎అమెరికాకు వచ్చేందుకు అనుమతి ఇవ్వడం వల్లే నాలుగేళ్లకే డెమొక్రట్ల ప్రభుత్వానికి ఈ స్థాయిలో ఇబ్బందులు వచ్చాయని చెబుతున్నారు.

వయేభారం బైడెన్‌కు ట్రంప్ కంటే ఎక్కువ వేధిస్తోంది. 81 ఏళ్ల బైడెన్‌ను మతిమరుపు సమస్య తీవ్రంగా వేధిస్తోందని అమెరికా వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పలు వేదికలపై ఆయన వ్యవహారశైలి చూస్తే ఆయనకు మతిమరుపు ఉందన్న అంశాన్ని నిజం చేస్తోంది. మరోసారి ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగితే.. పాలన మొత్తం అధికార యంత్రంగామే చూసుకోవాల్సి వస్తుందని.. తద్వారా అమెరికా సమగ్రతకే భంగం వాటిల్లితుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన చీమచిటుక్కుమన్నా.. వెంటనే వైట్ హౌజ్‌లో ఉండే అధ్యక్ష కార్యాయాలనికి చేరవేయాల్సిన అమెరికా రక్షణ విభాగం పెంటగాన్.. బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత నిద్రపోతుందని రిపబ్లికన్లు డెమొక్రట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదు. పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నారు. ఆ సమయంలో ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ముందే హెచ్చరించారు. దైపాక్షిక చర్చల ద్వారానే భారత్-పాక్‌లు సమస్యలు పరిష్కరించుకోవాలని.. సమన్వయం దెబ్బతింటే అది యుద్ధానికి దారితీస్తోందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ పోయి బైడెన్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని పలు దేశాల మధ్య ఇలాంటి సమస్యలు చాలానే వచ్చాయి. రష్యా,ఉక్రెయిన్ యుద్ధం దాదాపు మూడేళ్లుగా కొనసాగుతున్నా... ఇప్పటికీ ఆ యుద్ధాన్ని బైడెన్ ఆపలేకపోతున్నారు. అసలు రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడబోతున్నాయన్న సమాచారం అమెరికాకు లేకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మిడిలిస్ట్ దేశాల్లో ఎక్కడో చిన్న గ్యాంగ్ వార్ జరిగితేనే దానిపై వివరాలు సేకరించే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌కు... రెండుదేశాల మధ్య యుద్ధం ప్రారంభం కాబోతుంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం... యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా అమెరికా ఆపలేకపోవడం.. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.

ట్రంప్ తన హయాంలో యుద్ధాలను ఆపడంలో కీలకంగా వ్యవహరించారు. 2020లో తాలిబాన్ నేతలతో చర్చలు జరిపి సఫలీకృతం చేశారు. ఖతార్‌లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సమక్షంలో ఖతార్‌ రాజధాని దోహాలోని ఓ హోటల్‌లో ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రతినిధి జల్మే ఖలీల్‌జాద్, తాలిబన్‌ నేత ముల్లా బరాదర్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. 18 ఏళ్ల అఫ్గాన్‌ అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు ఏళ్లుగా జరుగుతున్న చర్చలు సాకారమైనట్లు అప్పట్లో ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు పంటికింది రాయి వంటి ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు... ఇటు ఉత్తరకొరియాతో కూడా ట్రంప్ కీలక చర్చలు జరిపారు. అమెరికాను లేపేస్తా బూడిద చేస్తా అంటూ రంకెలు వేసే ఉత్తరకొరియా నియంతపాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో.. ఆదే ఉత్తరకొరియాలో చర్చలు జరిపి ద్వైపాక్షి సంబంధాలు నెరిపారు ట్రంప్.

ఇలా విదేశీ వ్యవహారాల్లో ట్రంప్ లాంటి ముందుచూపు బైడెన్‌కు లేదని మెజార్టీ అమెరికన్లు నమ్ముతున్నారు. ఉంటే రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- పాలస్తినా వంటి యుద్ధాలు వచ్చేవి కావని అమెరికన్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బైడెన్ స్వదేశీ శ్రామికశక్తికి పెద్దపీఠ వేయకుండా పెద్దఎత్తున పన్నులు కట్టే విదేశీ శ్రామిక శక్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెరికన్లు విశ్వసిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అవకాశాలను ట్రంప్ అందిపుచ్చుకుంటున్నారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత అంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఆదేశ పౌరులను ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు చేసి.. విదేశీ వృత్తి నిపుణులు రాకుండా కట్టడి చేయాలంటే తనకు ఓటు వేయాలని ట్రంప్ ఇస్తున్న ప్రసంగాలు అమెరికా యువతను ఆలోచింపజేస్తున్నాయి.

కొన్నేళ్లుగా చైనా,రష్యా వంటి దేశాలు అమెరికాకు కంటగింపుగా మారాయి. ఆర్థికంగా, సైనిక శక్తిపరంగా అమెరికాకు ఈ రెండు దేశాలు సవాల్ విసురుతున్నాయి. ట్రంప్ హయాంలో చైనా దూకుడు ప్రదర్శిస్తే.. బైడెన్ హాయంలో రష్యా రెచ్చిపోతుందని అమెరికన్లు నమ్ముతున్నారు. పెద్దఎత్తున ఆంక్షలు విధించి డ్రాగన్‌ను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. వాణిజ్య యుద్ధం ప్రకటించి చైనాను ఇబ్బందులకు గురిచేశారు. అయితే బైడెన్ వచ్చిన తర్వాత చైనా కాస్త సైలెంట్ అయినా.. రష్యా రెచ్చిపోయింది. అమెరికా హెచ్చరికలను ఏనాడు పట్టించుకోని పుతిన్.. బైడెన్ అధికారపగ్గాలు చేపట్టగానే ఉక్రెయిన్‌ను ప్రపంచపటంలో లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా నాటో దళాలను రంగంలోకి దించితే.. అణుయుద్ధం కూడా చేస్తామని బైడెన్‌ను హెచ్చరిస్తున్నారు. దీంతో బైడెన్ సైలెంట్‌గా ఉండి వార్నింగ్స్ ఇవ్వడం తప్ప ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

ఇలా రష్యా,చైనా వంటి దేశాలను కంట్రోల్ చేయాలంటే ట్రంప్ మాత్రమే సరైన వ్యక్తిగా అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికలు బైడెన్‌కు అంత విషమపరీక్షలా మారాయి. ఎలాగైనా గెలివాలని ట్రంప్ భావిస్తుంటే.. మరోసారి గెలిచి పట్టు నిలుపుకోవాలని బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories