KTR

‘చేనేత కార్మికులను ఆదుకునేలా క్లస్టర్ల ఏర్పాటు’

Submitted by arun on Tue, 07/17/2018 - 16:32

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. కేంద్రం సహాకారంతో కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని మరో 10 క్లస్టర్లు మంజూరు చేయాలని జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానిని కోరినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 12వందల కోట్లతో నేతన్నకు చేయుత ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టామన్న ఆయన 8వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కస్టర్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్‌ కస్టర్సన్ని చేనేతలను ఆదుకునే విధంగా ఉంటాయన్నారు. 

లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం : కేటీఆర్

Submitted by arun on Mon, 07/16/2018 - 15:42

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం అని  స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా  తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఐటీఐ కాలేజీ బిల్డింగ్ ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ కలిసి ప్రారంభించారు. తర్వాత సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 

ఔటర్ ఆవలకి పొల్యూషన్. కే.టీ.ఆర్

Submitted by arun on Wed, 07/11/2018 - 11:54

ఆరోగ్యానికి హాని కాలుష్యం,

అది ఒక కాలకూట విషం,

దానిని తరిమేయాటం అవశ్యం,

ఇక పరిశ్రమలు ఔటర్ బైటనే వశం. శ్రీ.కో

కవితను మళ్లీ గెలిపిస్తే రాజకీయ సన్యాసం..

Submitted by arun on Fri, 07/06/2018 - 15:37

నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలలో 40శాతం వాటా కేసీఆర్ కుటుంబసభ్యులదేనని కోమటిరెడ్డి ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేస్తున్నారని, ఆమె చెల్లెను గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

‘కేటీఆర్...మీ నాన్న కేసీఆర్ అన్న మాటలు విను’ :ఉత్తమ్

Submitted by arun on Mon, 07/02/2018 - 13:53

తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని ఎవరూ కాదనలేరన్నారు. సోనియా వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని, కాదన్న వారు మూర్ఖులని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్‌ అన్న మాటలను ఉత్తమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘సోనియా గురించి అసెంబ్లీలో మీ నాన్న కేసీఆర్‌ అన్న మాటలు విను’ అంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు.

Trs మళ్ళీ రాకుంటే రాజకీయ సన్యాసం.ktr

Submitted by arun on Mon, 07/02/2018 - 12:45

రాకుంటే రాజకీయ సన్యాసమని  రాముడంటే, 
ఇదంతా విన్యాసమని  ఉత్తముడనే, 
దేవుడా ఇవి పాలిటిక్సా,

లేక ప్రజలకి అర్ధం కాని గొప్ప పాలిట్రిక్సా.

Tags

అర్జున్ రెడ్డి ఇంటికి కేటీఆర్

Submitted by arun on Mon, 06/25/2018 - 12:25

‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి గానూ మొదటి ఫిలింఫేర్‌ను అందుకున్న టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ.. తన అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ విషయాన్ని కేటీఆర్‌కు తెలపగా సంతోషించిన మంత్రి, విజయ్‌ నిర్ణయాన్ని అభినందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆదివారం సాయంత్రం విజయ్ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్ తన సోషల్ మీడియాలో తెలుపుతూ 

మంత్రి కేటీఆర్ మరోసారి ఫన్నీ ట్వీట్!

Submitted by arun on Thu, 06/21/2018 - 17:41

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటారు. ఎంతోమంది ట్విట్టర్ ద్వారానే కేటీఆర్‌కు తమ సమస్యలను చెప్పుకుంటుంటారు. తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యపైనా కేటీఆర్ స్పందిస్తూ.. వెనువెంటనే సహాయం చేస్తుంటారు. మంత్రిగా ప్రభుత్వ పనులతో ఎప్పుడూ బిజీగా ఉన్నా కూడా.. అప్పుడప్పుడూ తనలోని హాస్యచతురతను బయటపెడుతుంటారు. జోక్‌లు వేస్తూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా ఓ చిన్నారి హోంవర్క్‌ సంబంధించిన ఓ పత్రాన్ని షేర్‌ చేస్తూ కేటీఆర్‌ ఓ ఫన్నీ ట్వీట్‌ చేశారు. ‘జీవితంలో షార్ట్‌కట్స్ లేవని ఎవరన్నారు?. ఈ చిన్నారి ఎంత స్మార్ట్‌...

ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు

Submitted by arun on Thu, 06/21/2018 - 14:02

బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో  ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం  బాధకరమన్నారు మంత్రి కేటీఆర్‌. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.  జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.    నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్‌ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు.  ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.  

జులై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 ప్రారంభం : కేటీఆర్

Submitted by arun on Wed, 06/20/2018 - 13:14

అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్‌ ప్రారంభమైంది, ట్రయల్ రన్ లో భాగంగా  మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. మెట్రో ఫేజ్-2 పనులను పరిశీలించారు.  ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి  కేటీఆర్ స్పష్టంకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు.