KTR

కొడుకు, కోడలికి కేసీఆర్ బాకీ...ఎంతంటే...

Submitted by arun on Thu, 11/15/2018 - 13:19

మంత్రి కేటీఆర్‌ దంపతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.కోటికి పైగా బాకీ ఉన్నారు. ఇందులో కొడుకు కేటీఆర్‌కు ఇవ్వాల్సిన బాకీ 82లక్షల 82వేల 570రూపాయిలు. కోడలు శైలిమ వద్ద కూడా కేసీఆర్ అప్పు చేశారు. ఆమెకు 24లక్షల 65వేలు బకాయి ఉన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన దాఖలు చేసిన నామినేషన్‌లో తన ఆస్తులు, అప్పులు, తనపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ అఫిడవిట్‌లో పొందుపర్చారు. కేసీఆర్ సమర్పిచిన అఫిడవిట్ ప్రకారం.. కేసీఆర్‌ ఆస్తులు రూ.12.20 కోట్లు కాగా.. మొత్తంమీద ఆయనకు రూ.8.88 కోట్ల అప్పులు ఉన్నాయి.

Tags

కెసీఆర్‌ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్

Submitted by arun on Sat, 11/10/2018 - 17:59

కెసిఆర్ మళ్లీ సీఎం అయితే దివ్యాంగులకు మూడువేల పదహారు రూపాయల పెన్షన్ ఇస్తాం అని కెటిఆర్‌ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములోని సిరిసిల్ల ఫంక్షన్ హాల్ లో జరిగిన  దివ్యాంగుల ఆత్మీయ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే, చేసుకున్న వారికి  ఇచ్చే పారితోషకం లక్ష రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో బదిరులకు స్మార్ట్ ఫోన్ లు, లిపి పుస్తకాలను అందించామని, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం  పది కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన తెలిపారు.

నాకు సీఎం కావాలనే కోరిక లేదు: కేటీఆర్‌

Submitted by arun on Tue, 11/06/2018 - 16:40

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభద్రతాభావంతో ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వందసీట్లతో అధికారంలోకి వస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం కావాలనే ఆలోచన లేదన్నారు. మంత్రి హరీశ్‌తోనూ, పార్టీలోని ఇతర నేతలతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తామంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాలు, అధికారం కంటే కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదని, దాన్ని ఎప్పుడూ వీడబోమని కేటీఆర్‌ అన్నారు.

గెలిచేది టీఆర్‌ఎస్.. సీఎం అయ్యేది కేసీఆర్ : కేటీఆర్

Submitted by arun on Mon, 10/29/2018 - 15:17

రాష్ట్రంలో గెలిచేది టీఆర్‌ఎస్.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడని ఆయన పేర్కొన్నారు. మక్తల్‌లో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో మాట్లాడిన కేటీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు జిల్లా బాగా నష్టపోయిందన్నారు. అప్పర్ కృష్ణా పూర్తయి ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉండేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాజెక్టుల కింద 8 లక్షల నుంచి 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని చెప్పారు. పాలమూరు పచ్చబడుతుందంటే, వలస పోయిన వారు తిరిగి వస్తున్నారంటే అది టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘనత అని తెలిపారు.  

సీమాంధ్రులకు నేనున్నా...

Submitted by arun on Mon, 10/29/2018 - 10:41

హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్రులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ నిజాంపేట్‌లో మన హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాలన సాగిందని చెప్పారు. తెలంగాణను అస్తిర పర్చే వారిపైనే తమ పోరాటం అని చంద్రబాబుపై విమర్శలను రాజకీయ కోణంలో చూడాలని కేటీఆర్‌ అన్నారు.
 

ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని? : కేటీఆర్

Submitted by arun on Sat, 10/27/2018 - 16:55

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భయన్ లో ఆయన మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం పోలీసులు, అధికారులను వాడుతున్నారని ఆయన విమర్శించారు. సర్వేల పేరుతో తెలంగాణలో ఏపీ పోలీసులను మోహరించారని ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటని ఆయన ప్రశ్నించారు ధర్మపురిలో పట్టుబడిన డబ్బు టీడీపీ నేతలదే అన్న కేటీఆర్. ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  

కేటీఆర్‌ ఉత్తమ్‌ల మధ్య ట్వీట్ వార్

Submitted by arun on Thu, 10/25/2018 - 12:18

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ మొదలైంది. శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

బాబు చేతిలో మహాకూటమి జుట్టు ..గెలిస్తే తెలంగాణకు గుండు...

Submitted by arun on Tue, 10/23/2018 - 14:19

మహాకూటమిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి జుట్టుంతా చంద్రబాబు చేతిలో ఉందని  అధికారం కట్టబెడితే గుండు కొడతాడంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇబ్రహీం పట్నం ప్రాంతాన్ని ఫార్మా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  
 

యువతే లక్ష్యంగా టీఆర్ఎస్‌ ఎన్నికల ప్రచారం ...రంగంలో దిగిన...

Submitted by arun on Mon, 10/15/2018 - 10:29

పెట్టుబడి సాయంతో రైతులను, బతుకమ్మ చీరలతో మహిళల్లో ఆదరణ పొందిన టీఆర్ఎస్ యూత్‌ను ఆకట్టుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. కోడ్ అమల్లో ఉండటంతో  తాము గతంలో చేపట్టిన పథకాలను వివరిస్తూ కొత్త పంథాలో ముందుకు వెళుతోంది. ఏక కాలంలో బహుళ ప్రయోజనాలు పొందేలా అటు యూత్ ఇటు వీరి తల్లిదండ్రులను ఆకట్టుకునేలా క్షేత్రస్ధాయి ప్రచారం ప్రారంభించింది.