Congress party

గద్దర్ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్

Submitted by chandram on Tue, 11/20/2018 - 14:43

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెబుతున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదని అర్థమౌతుంది. కాగా గద్దర్ తనయుడు సూర్యం బెల్లంపల్లి నుండి శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసినా కాంగ్రెస్ మాత్రం మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించింది. కాగా ఇటు గద్దర్ కు,కుమారుడికి అన్యాయం జరిగిందనే భావనలో గద్దర్ ఉన్నట్లు విశ్లేశకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ తో గద్దర్ మంతనాలు జరిపిన ఫలితం దక్కలేదు.

మిగిలినవి.. మూడే...కూటమి పొత్తులో ...

Submitted by arun on Tue, 11/20/2018 - 10:48

కూటమి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పొత్తు పేరుతో సీట్లు పంచుకునేందుకు సిద్ధమైనా సర్దుబాట్ల పేర్లతో చర్చల మీద చర్చలు జరిపారు. చివరకు ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ పేరుతో మిత్రులకు కేటాయించిన సీట్లలోనే కయ్యానికి కాలుదువ్వారు. ముందు అనుకున్న పొత్తుల ప్రకారం కాంగ్రెస్‌ 94, టీడీపీ 14, టీజేఎస్‌ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీకి సిద్ధపడ్డాయి. అయితే చివరి నిముషంలో సీన్‌ కంప్లీట్‌గా రివర్స్‌ అయ్యింది. జనసమితిని అడ్డంగా బుక్‌ చేసింది కాంగ్రెస్‌. కేటాయించిన 8 స్థానాల్లో ఐదింట్లో పోటీకి నామినేషన్ వేసింది. దీంతో జనసమితి పోటీ చేసేది కేవలం 3 స్థానాల్లోనే. 

రెండో జాబితాలోనూ పొన్నాలకు దక్కని చోటు...

Submitted by arun on Wed, 11/14/2018 - 12:50

మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ మరోసారి మొండి చేయి చూపించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌.. 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది.

నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ...

Submitted by arun on Tue, 11/13/2018 - 15:58

టీఆర్ఎస్ తమ అభ్యర్థులను రెండు నెలల క్రితం ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నేతలు ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న అర్థరాత్రి అభ్యర్థుల జాబితాను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర రచ్చరచ్చ జరుగుతోందనీ, టికెట్లు రాని అభ్యర్థులు అక్కడే వంటావార్పు చేసుకుని ధర్నాలకు దిగుతున్నారని వెల్లడించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ముందు సెలైన్లు పెట్టుకుని మరీ ఆందోళనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పత్రికల్లో ఫొటోలు చూస్తుంటే నాంపల్లి దగ్గర ఉన్నది గాంధీ భవనా? లేదా గాంధీ ఆసుపత్రా?

రాహుల్‌ని పెళ్లిచేసుకోవాలనే కాంగ్రెస్‌లో చేరా

Submitted by chandram on Tue, 11/13/2018 - 15:38

ఎవరైనా  ఏ పార్టీలో అయినా పదవీని ఆశించో, లేక హోదాను ఆశించో పార్టీలో చేరుతారు. కాని ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తనూ కాంగ్రెస్ పార్టీలో చేరాడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పెళ్లిచేసుకోవాడానికే తను కాంగ్రెస్ లో చేరినట్లు ఓ యువతి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే  ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న మీడియా తనను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణమేటిటని అడిగిన మీడియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆ యువతి. మీడియాతో యువతి మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది రాహుల్ గాంధీని పెళ్లీ చేసుకోవాడానికే అని సమాధానం ఇచ్చింది.

ఆయనకు టికెట్‌ ఇవ్వకపోతే.. నేను పోటీ చేయను..!

Submitted by chandram on Fri, 11/09/2018 - 17:39

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ టికెట్ కోసం చిరుమూర్తి లింగయ్యకే కేటాయించాలని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ పట్టుపడుతున్నారు. లింగయ్యకు టికెట్ ఇవ్వని పక్షంలో మునుగోడు పోటి నుండి తప్పుకుంటా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుండి పోటీ నుండి తప్పుకుంటడని రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్కసీటు కేటాయిస్తామని కుంతియా ప్రకటనతో ఈ గందరగోళం మొదలైందన్నారు. గెలిచే అభ్యర్థులకే కాంగ్రెస్‌ టికెట్లు కేటాఇస్తుందని అన్నారు.

కాంగ్రెస్‌లో పెండింగ్ టెన్షన్

Submitted by arun on Fri, 11/09/2018 - 12:10

ఎట్టకేలకు 74 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన స్థానాలను వ్యూహాత్మకంగానే జాప్యం చేస్తోంది. రెబెల్స్ బెడదను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. టికెట్ రాని నేతలకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది. 

 కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. 74 మందితో తొలి జాబితాను రెడీ చేసిన కాంగ్రెస్ పార్టీ  26 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఇక మిగిలిన స్థానాలపై మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెబల్స్ బెడదను అధిగమించేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తోందని తెలుస్తోంది. 

నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్ధులతో కూడిన జాబితా

Submitted by arun on Tue, 11/06/2018 - 07:53

అధికారమే లక్ష్యంగా మహాకూటమితో జట్టుకట్టిన కాంగ్రెస్ కు కష్టాలు తప్పడం లేదు. ఓ వైపు పొత్తుల తిప్పలు కొనసాగుతుండగానే  సొంత పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులు అధిష్టానాన్ని కలవరపరుస్తున్నాయి.  చూస్తూ కూర్చుంటే పరిస్దితులు  చేయి దాటుతాయని భావించిన అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. చర్చలు జరిపేందుకు రావాలంటూ అసంతృప్తులకు రాయబారం పంపింది.
      

ఆధారాలు చూపకపోతే ఊచలు లెక్కపెట్టిస్తా

Submitted by arun on Sun, 11/04/2018 - 12:01

కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి హరీష్‌రావు త్వరలోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని కాంగ్రెస్‌నేత  ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్‌ ఇచ్చారు .తన పుట్టుక, చావు టీఆర్‌ఎస్ పార్టీలోనే అన్న హరీష్‌రావు తన జీవితం కేసీఆర్ కే అంకితం అన్నారు. ముచ్చటగా మూడోసారికూడా ఓడిపోతాననే భయంతో, మతిస్ధిమితం తప్పి కాంగ్రెస్‌ నేత ప్రతాప్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పక్కాఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హరీశ్ రావు హెచ్చరించారు. 

టీడీపీ ఎఫెక్ట్‌...వరుస రాజీనామాలతో ఏపీ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ

Submitted by arun on Sat, 11/03/2018 - 14:38

టీడీపీతో దోస్తీ... ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని సీనియర్‌ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉప్పూ నిప్పులా వ్యవహరించిన పార్టీతో ఎలా జత కడతారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సోనియాగాంధీని ఇటలీ దెయ్యమని, అవినీతి అనకొండ అంటూ నోరు పారేసుకున్న చంద్రబాబుతో  రాహుల్‌ జట్టు కట్టడాన్ని ఏపీ కాంగ్రెస్‌ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు చేయి చెంతకు చేరారని, కానీ చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని సూచిస్తున్నారు.