ap politics

జేసీ దివాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం...త్వరలోనే...

Submitted by arun on Wed, 07/11/2018 - 17:18

ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన తనయుడు పవన్‌రెడ్డి నిలబడతారనే ప్రచారం పాకిపోయింది. ఈ విషయంలో ఎంపీ జేసీ కూడా క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

పొలిటికల్ ఎంట్రీపై కత్తి క్లారిటీ.. చిత్తూరు జిల్లా నుంచే పోటీ

Submitted by arun on Mon, 07/02/2018 - 13:35

సినీ, రాజకీయ విశ్లేషకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్న కత్తి మహేష్, పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వస్తోంది. తన సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచి ఎంపీ గా బరిలోకి నిలవాలన్నతన ఉద్దేశ్యాన్ని తాజాగా బయటపెట్టారు కత్తి మహేష్. ఏ పార్టీ లో జాయిన్ అయ్యేది, ఎక్కడి నుంచి పోటీ చేస్తాన్నది త్వరలోనే సగర్వంగా ప్రకటిస్తానన్నారు. ఏదో పార్టీ నుంచి ఎమ్మెల్సీ గా నామినేట్ అయిపోవడం ఇష్టం లేదన్నఆయన, ఎవరి నుంచి పిలుపు వస్తుందో, తనను ఎవరు స్వాగతిస్తారన్నది చూడాలని అన్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. అన్ని పార్టీలతో తాను టచ్‌‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

2019 ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రో..?

Submitted by lakshman on Sun, 03/25/2018 - 23:26

2019 ఎన్నిక‌ల కురుక్షేత్రం ఎలా ఉండబోతుంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా అంటూ కేంద్రంపై పోరాటం చేస్తున్న పార్టీలపై ప్ర‌జ‌ల్లో ఉన్న సానుభూతి ఎంత..? ప‌్ర‌త్యేక‌హోదా పేరు చెప్పీ సింప‌తీని కొట్టేసేందుకు నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ, ప‌వ‌న్,  వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, బీజేపీలు రాజ‌కీయ ర‌ణ‌రంగానికి ర‌ణ‌భేరులు మోగిస్తున్నాయా..? అంటే అవున‌నే అంటున్నారు పొలిటిక‌ల్ క్రిటిక్స్ . 

ఏపీలో బీజేపీ ప‌ప్పులుడ‌క‌వ్

Submitted by lakshman on Sun, 03/18/2018 - 23:42

సీఎం చంద్ర‌బాబు మ‌రోమారు కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఉగాది వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న కేంద్రం యుద్ధం చేయాల‌ని చూస్తుంద‌ని అన్నారు. మొన్న‌టికి మొన్న కేంద్రం త‌మిళ‌నాడు త‌ర‌హ ఏపీ లో రాజ‌కీయం చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు ఆరోపించారు.

ఓం స‌ర్వే నమ: పొలిటిక‌ల్ లీడ‌రేన మ‌హ

Submitted by lakshman on Thu, 01/25/2018 - 10:58

ఏపీ లో పాలిటిక్స్ కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేత‌లు జాత‌కాల‌కు బ‌దులు స‌ర్వేల్ని న‌మ్ముకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ ఓడిపోతుంది. ఒక‌వేళ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిస్తే భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాల‌పై స‌ద‌రు సర్వే నిర్వ‌హించే సంస్థ‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు టాక్ 

జనామోదం పొందే ధీరులెవరు?

Submitted by lakshman on Mon, 09/18/2017 - 18:28
ఎన్నికల వేడి రాజుకుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోనూ నాయకులు శరవేగంగా జనంలోకి వెళ్లిపోతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కోరకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ ఎటూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో...

ఏపీలో ముదిరిన ముందస్తు రాజకీయం

Submitted by lakshman on Tue, 09/12/2017 - 21:09
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ముందస్తు ఎన్నికల వైపు పరుగులు తీస్తోందా? 2018 డిసెంబర్‌లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయా? ఏపీలో అధికారప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి...