Top Stories

రథసారథిగా వేలితివా ఓ హరన్న!

Submitted by admin on Wed, 08/29/2018 - 13:45

అన్నగారి అఖండ చైతన్య రథానికి,
రథసారథిగా వేలితివా ఓ హరన్న,
నీవు ఇక లేవన్న నిజం మాత్రం,
ఒక ఆలోచన అయిన అది గరళమన్న,
జీవితమనే ఇక్కడి ప్రయాణాన్ని,
ఇలా ముగించితివా నేడు ఓ హరన్న,
ఆ హరి నీ ఆత్మకి శాంతి అందించాలని,
అశ్రునయనాలతో నీ తెలుగు అభిమాని.

నోట్ల రద్దు.. గుట్టు రట్టు

Submitted by arun on Fri, 06/22/2018 - 13:46

నోట్ల రద్దుకు అనేక కారణాలు చెబుతోంది బీజేపీ. ఈ వ్యవహారం ఆ పార్టీకి వరంగా మారిందని ప్రతి పక్షాలు సైతం బలంగా చెబుతున్నాయి. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌గావున్న అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు (ఏడీసీబీ)లో నోట్ల రద్దు తర్వాత ఆ నోట్ల డిపాజిట్లు వెల్లువెత్తాయి. జిల్లా సహకార బ్యాంక్ అన్నింటిలోనూ ఈ బ్యాంక్‌కే ఎక్కువ డిపాజిట్లు వచ్చాయి. ఐదురోజుల్లో మొత్తం రూ.745.59 కోట్ల విలువైన రూ.500, రూ. 1000 నోట్లు జమ అయ్యాయి. ముంబైకి చెందిన ఆర్‌టీఐ కార్యకర్త మనోరంజన్‌ ఎస్‌.రాయ్‌ తన పిటిషన్‌ ద్వారా ఈ వివరాల్ని రాబట్టారు.

ఐకానిక్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన

Submitted by arun on Fri, 06/22/2018 - 12:30

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారు. ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో  ఐదు ఎకరాల విస్తీర్ణంలో 36 అంతస్తుల భవనాలను 500 కోట్ల వ్యయంతో 158 మీటర్ల మేర నిర్మించనున్నారు.  రాయపూడిలోని ప్రభుత్వ భవనాల సముదాయానికి చేరువలో ఐకానిక్‌ టవర్‌ నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది.    ఈ టవర్‌ను ఏ ఆకారంలో  అత్యాధునికమైన సౌకర్యాలతో  ఆహ్లాదకరమైన వసతులతో నిర్మించనున్నారు. భూగోళం రూపంలో తిరిగే రెస్టారెంట్‌  ఐకానిక్‌ టవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

పాస్‌పోర్టు కావాలా.. మతం మార్చుకొని రా!

Submitted by arun on Fri, 06/22/2018 - 11:17

లక్నో పాస్‌పోర్ట్ కార్యాలయంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కలగజేసుకోవడంతో కథ సుఖాంతం అయింది. దురుసుగా ప్రవర్తించిన పాస్‌పోర్ట్ అధికారిపై బదిలీ వేటు పడింది. 

ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు

Submitted by arun on Thu, 06/21/2018 - 14:02

బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో  ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం  బాధకరమన్నారు మంత్రి కేటీఆర్‌. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.  జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.    నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్‌ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు.  ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.  

జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా....జెనెటిక్‌ సర్వేలో నివ్వెరపోయే నిజాలు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:34

జెనటిక్‌ ప్రోబ్లమ్స్‌పై జరిగిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మేనరికపు పెళ్లిళ్లతో పిల్లలు జన్యు లోపాలతో పుడతారనే ప్రచారానికి దిమ్మదిరిగే జవాబు దొరికింది. అసలు జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా? లేక మరేదైనా కారణముందా? 

యోగాను ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలి

Submitted by arun on Thu, 06/21/2018 - 11:05

యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ...ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా వర్ధిల్లుతోందన్నారు. యోగా.. కుటుంబం, సమాజంలో సద్భావన కలిగిస్తుందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు.

జులై చివరి నాటికి మెట్రో ఫేజ్-2 ప్రారంభం : కేటీఆర్

Submitted by arun on Wed, 06/20/2018 - 13:14

అమీర్‌పేట స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్‌ ప్రారంభమైంది, ట్రయల్ రన్ లో భాగంగా  మెట్రోలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రయాణించారు. మెట్రో ఫేజ్-2 పనులను పరిశీలించారు.  ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు మెట్రోను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తొలి దశ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జులై చివరి నాటికి మెట్రో రెండో దశ పూర్తవుతుందన్నారు. నగరంలో మెట్రోను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి  కేటీఆర్ స్పష్టంకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు.

కోటాపై క్లారిటీ...తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్లు

Submitted by arun on Wed, 06/20/2018 - 08:32

 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బీసీ ఓటర్ల గణన పూర్తికావడంతో... రెండు మూడ్రోజుల్లో బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసేందుకు పనులు మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

ముగింపు దశకు వచ్చిన వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం...మళ్లీ గెలుస్తామని వైసీపీ ఎంపీల ధీమా

Submitted by arun on Wed, 06/20/2018 - 08:03

వైసీపీ ఎంపీల రాజీనామాల అంశం ముగింపు దశకు వచ్చేసింది. స్పీకర్ విదేశీ పర్యటన ముగించుకుని భారత్ తిరిగి రావడంతో ఇక రాజీనామాల ఆమోదం లాంఛనమే అంటున్నారు పార్టీ శ్రేణులు. కొంత కాలంగా నానుతూ వచ్చిన ఈ వ్యవహారం ఎట్టకేలకు చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌  విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చారు. దీంతో వైసీపీ ఎంపీలు మళ్లీ తమ రాజీనామాలు ఆమోదించుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాజీనామాల పని పూర్తి కాగానే ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటిస్తారని, మరో రెండు లోక్‌సభ స్థానాలతోపాటు తమ స్థానాలకూ ఎన్నికలు జరుగుతాయని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.

Tags