tdp

ముసుగులు తొలగిపోయాయ్..2019లో ఎవరు ఎవరెవరితో ...

Submitted by arun on Fri, 08/10/2018 - 11:35

నిన్నటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక 2019 ఎన్నికల తీరును కళ్లకు కడుతోందా?  ఇన్నాళ్లూ గుంభనంగా వ్యవహరించిన పార్టీలన్నీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ వైఖరిని బయటపెట్టక తప్పలేదా?2019లో యూపీఏ వర్సెస్ ఎన్డీఏ యుద్ధంలో ప్రాంతీయ పార్టీలలో ఏ పార్టీ ఎటువైపు? ఈ అంశంపై క్లారిటీ వచ్చిందా?

టీడీపీ వర్సెస్‌ జీవీఎల్‌!

Submitted by arun on Wed, 08/08/2018 - 10:37

రైల్వే జోన్‌ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా ముగిసింది. సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావుతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్రమంత్రిని సైతం నిలదీశారు. దీంతో ఈ సమావేశం హాట్ హాట్‌ గా ముగిసింది.  

సైకిల్ దూకుడు

Submitted by arun on Thu, 08/02/2018 - 17:24

కేంద్రం ఇచ్చిన విభజన హామీల కోసం,
ఆందోళన రోజు రోజు పెంచెను సైకిలు,
ఎలాగైనా ఇక కడప ఉక్కు కర్మాగారం,
ఏర్పాటు చేయాలనేదె వారి వకీలు. శ్రీ.కో

 విభజన హామీల సాధనలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ రాష్ట్రపతికి విన్నవించారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags

పొత్తులపై కాంగ్రెస్ లో అయోమయం...పొత్తులుంటాయని తేల్చి చెప్పిన రాహుల్

Submitted by arun on Thu, 08/02/2018 - 12:46

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి కలసి అడుగులేస్తాయా? పొత్తులుంటాయని రాహుల్ తేల్చేయడంతో అది టిడిపితోనేనని రాష్ట్ర నేతలు అన్వయించుకుంటున్నారు. ఏపి వరకూ టిడిపి వ్యూహంపై స్పష్టత రాకపోయినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టిడిపి కలిసే అడుగేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Tags

అయితే పొత్తులు.. లేకపోతే వలసలు

Submitted by arun on Wed, 08/01/2018 - 16:31

ప్రజా సమస్యలపై పోరాటం లేదు ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తింది లేదు పార్టీ బలోపేతం పై ఆలోచన లేదు. అయితే పొత్తులు లేకపోతే వలసలు. ఇది తెలంగాణ టీడీపీ నేతల పరిస్థితి. పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు సైతం పార్టీ పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వార్తలతో ఇతర పార్టీలు గ్రామాల బాట పడితే టీడీపీ నేతలు మాత్రం నివాసాలకే పరిమితం అవుతున్నారు. 

Tags

తెలంగాణలో పొలిటికల్ హీట్...బద్ధశత్రువులు దోస్తీ కడుతారా ?

Submitted by arun on Tue, 07/31/2018 - 10:19

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు పొత్తులపైనే దృష్టి పెట్టాయ్. కొన్ని పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతుంటే మరి కొన్ని పార్టీలు పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అవుతున్నాయ్. జాతీయ రాజకీయాల్లో పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై రోజుకో కొత్త ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో పొత్తులతో ఎన్నికలు వెళ్లే పార్టీ ఏదీ ? సింగిల్‌ పోటీ చేసే పార్టీలెన్నీ ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. పొత్తులపై నేతలేమంటున్నారు. 

సింహం సింగిల్‌గానే వస్తుంది: మంత్రి కేటీఆర్

Submitted by arun on Mon, 07/30/2018 - 17:31

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయట అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత మంది కలిసినా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని, రానున్న ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే కేసీఆర్ చేసిన పనులకు సార్థకత ఉంటుందని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
 

టీడీపీతో పొత్తు.. గెలిస్తే ఉత్తమ్ సీఎం..

Submitted by arun on Mon, 07/30/2018 - 11:07

మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతున్నాయ్. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సీఎం అనడం వివాదాస్పద మవుతున్నాయ్. అక్కడితో ఆగని సర్వే సత్యనారాయణ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయడం చర్చనీయాంశంగా మారాయ్.

ఒక తాటిపైకి కాంగ్రెస్, టీడీపీ...మారుతున్న రాజకీయ సమీకరణలు

Submitted by arun on Thu, 07/26/2018 - 14:07

రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్‌, టీడీపీలు రాబోయే ఎన్నికల్లో జట్టు కడతాయా? ఇందుకు ఇరు పార్టీలు సిద్ధమేనా...? ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదిశగానే చకచక పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇందుకు రాష్ర్ట నేతలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  

Tags

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయ్ : బీజేపీ

Submitted by arun on Tue, 07/24/2018 - 17:18

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీకి న్యాయం జరగలేదని బీజేపీతోనే ఏపీ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రధాని ఇచ్చిన చాలా హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న జీవీఎల్‌ ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారన్న ఆయన చేతనైనంత సాయం కేంద్రం చేస్తోందన్నారు.