CPI

కూటమిలో పొత్తుల పోరు..

Submitted by chandram on Thu, 11/15/2018 - 20:07

ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ జత కట్టాయి. మహాకూటమిగా అవతారించాయి.  పొత్తు విషయంలో టీడీపీ సర్దుకుపోయే దోరణిలో ఉన్నా సిపిపి, టీజేఎస్ అనేక వివాదాలకు దారితీశాయి. మొదట కూటమకి చైర్మెన్ పదవి పై పట్టుపెట్టిన టిజేఎస్ దాన్ని సాధించుకుంది.  సీట్ల సర్దుబాటు విషయంలో ముప్పుతిప్పలు పెడుతోంది. టీజేఎస్ తరహాలోనే సీపీఐ పేచి పెట్టింది. చివరకు పెద్దన్న పాత్రలోకాంగ్రెస్ 8 స్థానాలు టిజేఎస్ కు, సిసిఐకి 3 స్థానాలు కేటాయిస్తే మొదటి పేచి పెట్టిన ఆ రెండు పార్టీలు చివరకు అంగీకరించాయి. 

సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

Submitted by arun on Wed, 11/14/2018 - 17:42

మహాకూటమిలో భాగంగా కేటాయించిన మూడు స్థానాలకు సీపీఐ అభ్యర్థులను ప్రకటించింది. హుస్నాబాద్ నియోజకవర్గం అభ్యర్థిగా చాడ వెంకట్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయబాయ్ పోటీ చేస్తారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు. బెల్లంపల్లి అభ్యర్థి ఎవరన్న విషయమై ఆఖరి క్షణం వరకు పార్టీలో చర్చ జరిగింది. ఎట్టకేలకు గుండా మల్లేశ్ పేరును ఖరారు చేసింది.

మహాకూటమి పొత్తులపై మెత్తబడిన సీపీఐ

Submitted by arun on Tue, 11/13/2018 - 10:55

మహాకూటమి పొత్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సీపీఐ ఎట్టకేలకు మొత్తబడింది. కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నందున మూడు సీట్లకే పరిమితం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల తరువాత అధికారంలో వస్తే సీపీఐకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పడంతో  తాజా ప్రతిపాదనకు సీపీఐ నేతలు అంగీకరించారు. ఈ విషయాన్ని కాసేపట్లో  సీపీఐ కేంద్ర కమిటీ అధికారికంగా ప్రకటించనుంది. దీంతో పాటు పార్టీకి కేటాయించిన హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయలు పోటీ చేయనున్నారు. మరో స్ధానం బెల్లంపల్లి నుంచి పోటీ చేసే అభ్యర్ధిని నేడు ఖరారు చేయనున్నారు. 

ఉమ్మడి అజెండాపై మహా కూటమి ఫోకస్‌

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:31

అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మహాకూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టారు. ఉమ్మడి అజెండాతోనే కూటమి పార్టీలన్నీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించిన కూటమి పార్టీలు ముసాయిదాపై అంగీకారానికి వచ్చాయి. మరోసారి చర్చించి రేపే ఉమ్మడి అజెండాను ప్రకటించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశం ప్రాథమికంగా ఓ కొలిక్కి రావడంతో కూటమి పార్టీలు ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టాయి.

కాంగ్రెస్‌లో కట్టలు తెంచుకున్నఆశావహుల ఆగ్రహం...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:46

తలుపులు బద్దలవుతున్నాయి, దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి, శాపనార్థాలు  హోరెత్తుతున్నాయి. ప్రళయం తప్పదన్న హెచ్చరికలు పెళ్లుమంటున్నాయి. భూకంపం సృష్టిస్తామన్న కేకలు కెవ్వుమంటున్నాయి. అభ్యర్థులపై కేవలం టీజర్‌ రిలీజ్‌ చేసిన కొన్ని గంటల్లోనే, హస్తం పార్టీ బాక్సాఫీసు అల్లకల్లోలమవుతోంది. మహాకూటమి జాబితా విడుదలైన తర్వాత మహా ప్రళయమేనా?

కొలిక్కిరాని కూటమి లెక్కలు...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:33

రోజుల తరబడి సమీక్షలు, చర్చలు, వరుసగా సమావేశాలు, మంతనాలు అయినా మహాకూటమి లెక్కలు కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ కు తమ సీట్లపై క్లారిటీ వచ్చినా భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపుపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ముందు తమ లెక్కతేల్చాలని తెగేసి చెబుతోంది సీపీఐ. మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలకు సిద్ధమైన నేపధ్యంలో తమకు సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని భాగస్వామ్య పక్షాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపించడంతో సీట్లతో పాటు తమకు కేటాయించే స్థానాలపై కూడా క్లారిటీ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మహాకూటమికి సీపీఐ గుడ్‌బై ?

Submitted by arun on Fri, 11/09/2018 - 10:57

తెలంగాణలో మహాకూటమికి బీటలు వచ్చే అవకాశం ఉందా..? అసంతృప్తితో ఉన్న సీపీఐ కూటమికి గుడ్‌‌బై చెప్పనుందా..? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. తాము కచ్చితంగా చెప్పిన తర్వాత కూడా 3 సీట్లే కేటాయించడంపై సీపీఐ నేతలు మండిపడుతున్నారు. కనీసం ఐదు స్థానాలైనా కేటాయిస్తారని భావించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న సీపీఐ నేతలు కూటమిలో ఉండాలా? వద్దా?  అన్నదానిపై ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యవర్గ అత్యవసర సమావేశంలో తేల్చేయబోతున్నారు. 

సీపీఐ నేతలతో కోదండరాం భేటీ

Submitted by arun on Wed, 11/07/2018 - 14:05

టీజేఎస్ అధినేత కోదండరాం సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. కూటమిలో రెండుపార్టీలకు సీట్ల కేటాయింపుపై చర్చించారు. బెల్లంపల్లి, వైరా, దేవరకొండ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా ఉందని అయితే హుస్నాబాద్ , కొత్తగూడెం స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతుంది. కొత్తగూడెం స్థానం కోసం జాతీయ నాయకులపై కూనంనేని సాంబశివరావు ఒత్తిడి తెస్తున్నారు. సీపీఐకి మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎన్నికల్లో గెలిచాక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ ప్రతిపాదనలపై సీపీఐ , టీజేఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 

మావోయిస్ట్‌ చీఫ్‌గా బసవరాజ్‌

Submitted by arun on Tue, 11/06/2018 - 16:54

మావోయిస్ట్‌ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్‌గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్‌ సారథిగా వ్యవహరిస్తున్నారు. విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు కావడం గమనార్హం. 

తెలంగాణలో కూడుకుంటున్న మహాకూటమి

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:30

మహాకూటమి కోసం ఇంతవరకూ రహస్యంగా, వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు తొలిసారి కలిసికట్టుగా కన్పించాయి. హైదరాబాద్  పార్క్ హయత్ లో సమావేశమైన మూడు పార్టీల ముఖ్య నేతలు, మహాకూటమి దిశగా తొలి అడుగు వేశారు. ఇది కేవలం ప్రాథమిక సమావేశమేనని, మరిన్ని భేటీలు నిర్వహిస్తామని చెప్పారు. పొత్తులు-సీట్ల పంపకాలపై మరింతగా చర్చించాల్సి ఉందన్నారు. టీఆర్ఎస్ ను గద్దెదించాలంటే, అన్ని పార్టీలూ కలిసిరావాలని భావిస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ . రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి.