Chalamalasetty Sunil

వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. టీడీపీలోకి కీలక నేత

Submitted by arun on Wed, 09/12/2018 - 10:46

వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి కాకినాడ నేత చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అక్టోబరు రెండో తేదీన చెలమలశెట్టి సునీల్‌ టీడీపీలోకి చేరుతున్నారని తెలిసింది. ఆయనను వైసీపీ కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆ పార్టీ అధిష్ఠానం తప్పించినట్టు సమాచారం.