Kondagattu Bus Accident

కొండగట్టు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన కండక్టర్

Submitted by arun on Thu, 09/13/2018 - 12:17

కొండ గట్టు ప్రమాదానికి బ్రేకులు ఫెయిల్ అవ్వడమే కారణమని ఆ బస్సు కండక్టర్ తెలిపారు. మొన్నటి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్ ప్రమాద సమయంలో పరిస్థితి గురించి వివరించారు. ప్రమాదానికి ముందు మూడు స్పీడ్ బ్రేకర్లు వచ్చాయని అప్పుడు బ్రేక్ వేస్తే బస్సు కంట్రోల్ అవ్వలేదని కండక్టర్ చెప్పారు. స్పీడ్ బ్రేకర్లు దాటాక బస్సు వేగం మరింత పెరిగిందని తెలిపారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయో..గేరు న్యూట్రల్ ‌లో ఉందో తెలియదని అన్నారు. ఆ మరుక్షణమే బస్సు వేగంగా లోయలోకి దూసుకెళ్ళిందని కండక్టర్ తెలిపారు.  

అంజన్నకు ఆగ్రహమొచ్చిందా...కోతులను చంపడంతోనే ప్రమాదం జరిగిందా?

Submitted by arun on Thu, 09/13/2018 - 11:26

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆగ్రహం కారణంగానే ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందా? స్వామివారికి ప్రతిరూపంగా భావించే వానరాలను చంపేయడంతోనే ఈ బస్సు లోయలోకి పడిపోయిందా? జగిత్యాల జిల్లాలో చాలామంది ఈ విషయమై చర్చించుకుంటున్నారు. జిల్లాలోని కొడిమ్యాల మండలం, సూరంపేట మామిడివాగు దగ్గర దాదాపు 60 వానరాల కళేబరాలు కనిపించాయి. వీటిని పరిశీలించిన కొడిమ్యాల రేంజర్ లత.. వానరాలను కరెంట్ షాక్ పెట్టి హతమార్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే..అంజన్నస్వామికి ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువ

Submitted by arun on Wed, 09/12/2018 - 16:18

రెప్పపాటులో ఘోర ప్రమాదం. ఏం జ‌రిగిందో తెలిసే లోపే భారీ న‌ష్టం జ‌రిగిపోయింది. క్షణాల వ్యవ‌ధిలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. కొండ‌గ‌ట్టు ఘోర ప్రమాదంపై ప్రత్యక్ష సాక్ష్యుల మాట‌లివి. ఎప్పటికిలాగే అక్కడి నుంచి ప్రయాణిస్తున్న ఒక ఒస్సు సుర‌క్షితంగా గ‌మ్యానికి చేరుకుంటుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మృత్యుకోర‌ల్లోకి వెళ్లిన బ‌స్సు అమాయకులను మింగేసింది. అందులో మహిళలే ఎక్కువ కాగా... చిన్నారులు కూడా ఉండటం కూడా విషాదం. 

దేశంలోనే అతి పెద్ద ప్రమాదం... ఆర్టీసీ చరిత్రలోనే మహా విషాదం

Submitted by arun on Wed, 09/12/2018 - 16:13

కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణమేంటి..? 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమెవరు..? ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే మహా విషాదాన్ని మిగిల్చిందా..? ఘాట్ రోడ్డులో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని ఆర్ అండ్ బీ అధికారుల అలసత్వమే కొంపముంచిందా..? అసలు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బాధ్యులెవరు..? hmtv చేసిన పరిశీలనలో 10 ప్రమాద కారణాలున్నట్లు ‌తేలింది. 

ప్రమాదానికి మొదటి కారణం బస్సులో ఎక్కువ మందిని ఎక్కించడం. కేవలం 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ 86 మందిని ఎక్కించారు. బస్సు కిక్కిరిసి పోవడంతో దానికి కంట్రోల్ చేయడం డ్రైవర్ వల్ల కాలేదు. 

కండిషన్‌ లేదు... ప్రాణాలంటే కనికరమూ లేదు!!

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:41

కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్‌ శ్రీనివాస్‌తో సహా 57 మంది మృతి చెందారు. ఇంతమందిని బలితీసుకున్న బస్సు ప్రమాదానికి అతివేగం, ఓవర్‌లోడే కారణమని తెలుస్తోంది. 

కొండగట్టులో ప్రాణాలు తీసిన మృత్యు మలుపు

Submitted by santosh on Wed, 09/12/2018 - 12:33

అదో మృత్యు మలుపు. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా..ప్రాణాలు తీసే టర్నింగ్ అది. గతంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రమాదాలు జరిగి... ఎంతో మంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు... అదే మలుపు...మృత్యు మార్గంగా మారింది. 57 మంది ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేసింది. 

ఆర్టీసీ షార్ట్ కట్ రూటే కొంప ముంచింది

Submitted by arun on Wed, 09/12/2018 - 09:19

కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణమేంటి..? 57 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమెవరు..? ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే మహా విషాదాన్ని మిగిల్చిందా..? ఘాట్ రోడ్డులో సరైన రక్షణ ఏర్పాట్లు చేయని ఆర్ అండ్ బీ అధికారుల అలసత్వమే కొంపముంచిందా..? అసలు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి బాధ్యులెవరు..? hmtv చేసిన పరిశీలనలో 10 ప్రమాద కారణాలున్నట్లు ‌తేలింది. 

ప్రమాదానికి మొదటి కారణం బస్సులో ఎక్కువ మందిని ఎక్కించడం. కేవలం 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ 86 మందిని ఎక్కించారు. బస్సు కిక్కిరిసి పోవడంతో దానికి కంట్రోల్ చేయడం డ్రైవర్ వల్ల కాలేదు. 

ప్రమాదానికి 10 కారణాలు

Submitted by arun on Tue, 09/11/2018 - 16:29

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 51 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడుగడుగునా డ్రైవర్ అ జాగ్రత్త కూడా కనిపిస్తోంది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో...ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డబ్బులకు కక్కుర్తి పడి 88 మందిని ఎక్కించారు. పైగా ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట్ల కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నచోట్ల.. స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ ఎలాంటి గుర్తులూ లేవు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. 
ప్రమాదానికి 10 కారణాలు

కొండగట్టు రోడ్డు ప్రమాదానికి అసలు కారణం తెలిసింది!

Submitted by arun on Tue, 09/11/2018 - 16:15

కొండగట్టు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 51 మంది ప్రాణాలు పోవడానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడుగడుగునా డ్రైవర్ అ జాగ్రత్త కూడా కనిపిస్తోంది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ప్రయాణించడానికి అనువైన బస్సులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డబ్బులకు కక్కుర్తి పడి 88 మందిని ఎక్కించారు. పైగా ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్న చోట్ల కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. స్పీడ్ బ్రేకర్స్ ఉన్నచోట్ల స్పీడ్ బ్రేకర్‌ను సూచిస్తూ ఎలాంటి గుర్తులూ లేవు. బస్సు కూడా ఏ మాత్రం కండీషన్‌లో లేనిదని విజువల్స్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.