you should have good friend

మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం..  

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 19:51

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో కూడా వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక వ్యక్తికి మరో వ్యక్తితో ఉండే సాన్నిహిత్యం ప్రస్తుత రోజుల్లో లేదు. కష్టమైనా, సుఖమైనా మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడం లేదు. గత పదేళ్లలో టెక్నాలజీ రంగంలో చోటుచేసుకున్న మార్పు మనిషి జీవనవిధానాన్నే మార్చేసింది. ఈ మార్పు కారణంగా కొన్ని పాత జ్ఞాపకాల్ని, ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అచారాల్నీ, వదులుకోక తప్పలేదు. ఉదాహరణకు దశాబ్ద కాలం కిందట చరవాణి(మొబైల్ ఫోన్) ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో ఇదొక విప్లవమే.. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడటానికి అవసరమైన మాధ్యమమే ఈ ఫోన్..