Telangana Elections 2018

కూటమిలో బీసీ సీట్లపై ఆర్‌ కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం

Submitted by arun on Tue, 11/13/2018 - 16:46

బీసీ సీట్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని మహాకూటమిలో ప్రజాస్వామ్యం లేదని ఉన్నదంతా ధనస్వామ్యం అని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. 65 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో బీసీలకు 13 స్థానాలే కేటాయించడం సమర్థనీయం కాదన్నారు. కులం, ప్రాంతం, డబ్బు చూసే టిక్కెట్లు ఇస్తున్నారన్న కృష్ణయ్య బీసీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దేశంలో 56శాతానికి పైగా ఉన్న బీసీలకు 14శాతం కూడా ప్రాతినిధ్యం లేదని ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ పథకం ప్రకారమే పార్టీలన్నీ బీసీలపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో రెబెల్స్ తుపాన్ ...ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ, పరిస్ధితి ఉద్రిక్తం

Submitted by arun on Tue, 11/13/2018 - 13:04

తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తొలి జాబితాలో చోటు దక్కని నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  మహాకూటమి పొత్తులో భాగంగా మితప్రక్షాలకు కేటాయించిన స్ధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వరంగల్ వెస్ట్ స్ధానాన్ని టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డికి మద్ధతుగా నిరసనకు దిగారు. 35 ఏళ్లుగా పార్టీని నమ్ముకుంటే ఇదేనా బహుమతి అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు.

మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:38

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలవుతున్నామహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాము కోరిన నియోజకవర్గాలు ఇవ్వకపోవడం, సంఖ్యపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం, జాబితా ఖరారులో జాప్యం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. మహాకూటమిలో సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర జాప్యమవుతోంది.

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తాచాటుతుంది

Submitted by chandram on Fri, 11/09/2018 - 16:42

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గం నుండి ల‍క్ష ఓట్ల మెజరిటీతో గెవడం ఖాయమని ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.కంటివెలుగుతో పేదల పెన్నిదిగా ఉన్న కెసిఆర్ కు ఓటువేసి గెలిపించాలన్నారు. తూప్రాన్ ను మున్సిపాలిటీగా, రీజీనల్ రింగ్ రోడ్డుతో అభివృద్ది పదంలో దూసుకపోతుందని తెలిపారు. రూ. 6కోట్లతో గజ్వేల్ లో కెసిఆర్ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు గజ్వేల్ ప్రచారంలో హరీశ్ రావు అన్నారు. కెసిఆర్ కు తిరుగులేదని ఇండియా టుడే సర్వేలో 75శాతంతో మళ్లీ కెసిఆరే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపడుతరని సర్వే వెల్లడించిన విషయం గుర్తుచేశారు.

కొలిక్కిరాని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చర్చలు

Submitted by arun on Wed, 11/07/2018 - 11:04

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. తుది జాబితా ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఢిల్లీలో దాదాపు 14 గంటలపాటు సుదీర్ఘ భేటీ నిర్వహించినా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల వారీగా సమర్ధులైన నాయకుల కోసం ఆరా తీస్తోంది. ఇప్పటికే 54 మందిని ఖరారు చేసిన ఎన్నికల కమిటీ మిగిలిన అభ్యర్థుల జాబితా కూర్పుపై కసరత్తులు చేస్తోంది. 

ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేకపోతున్నారు: పొన్నం

Submitted by arun on Wed, 11/07/2018 - 10:42

టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల గురించి మాట్లాడటం కాదని, చేతనైతే మీ సంగతి చూసుకోండని విమర్శించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 14 సీట్ల కోసం 60 రోజులుగా తేల్చుకోలేకపోయిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. మహాకూటమి గురించి మాట్లాడే కంటే నాలుగున్నరేళ్లలో జనాన్ని మోసం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నిలదీస్తుంటే ప్రచారం చేయలేక పరువు తీసే విధంగా టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

కారెక్కిన కాసాల బుచ్చిరెడ్డి

Submitted by arun on Sat, 11/03/2018 - 16:28

సంగారెడ్డి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాల బుచ్చిరెడ్డి ఎట్టకేలకు శుక్రవారం ఆపధర్మ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థంపుచ్చుకున్నారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. మూప్పై ఏళ్లుగా బీజేపీ పార్టీలో పని చేసి పార్టీని వీడడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సహాయం, సేవ చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు బుచ్చిరెడ్డి స్పష్ఠం చేశారు.స్వతహాగా రైతుబిడ్డనైన నేను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సాగుకు పెట్టుబడి సాయం, రైతుబంధు పథకం, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా వంటి పథకాలకు నేను మంత్రముగ్ధునైయ్యానని బుచ్చి వెల్లడించారు.

డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి నిరసనల సెగ

Submitted by arun on Thu, 11/01/2018 - 13:42

టీఆర్ఎస్‌ అభ్యర్థులకు గ్రామాల్లో నిరసన సెగలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. మెదక్‌ జిల్లా శివాయిపల్లి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆమెను తమ గ్రామంలోకి అడుగుపెట్టొద్దంటూ అడ్డుకున్నారు. తాగు, సాగు నీటి సమస్యతో పాటు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల గురించి నిలదీశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ‌కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 
 

టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేకు ఝలక్‌

Submitted by arun on Wed, 10/24/2018 - 11:03

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ బాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచారానికి వచ్చిన సతీష్ బాబు ను గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. తమ నాయకుడిని అడ్డుకోవంతో సహించలేని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకారులను పక్కకు నెట్టేశారు. మహిళలతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న చిగురుమామిడి సురేందర్‌ సీఐ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా సరే సతీశ్‌ను గ్రామంలోకి రానివ్వమంటూ నినదించారు.

అభ్యర్థులకు ప్రచార వ్యూహాన్ని దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ ...అలసత్వం వీడితే...

Submitted by arun on Mon, 10/22/2018 - 10:04

విజయదశమి వెళ్లిపోయింది.. ఇక విజయతీరాలను అందుకోవడమే మిగిలి ఉందని.. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా అలసత్వం వద్దంటూ సూచనలు చేశారు. నిర్లక్ష్యం వహించకుంటే ఈ సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని భరోసా ఇచ్చారు.