malayala-super-star-mohanlal-maybe-join-in-bjp

బీజేపీలోకి సూపర్ స్టార్..? మోడీతో భేటీ..

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 16:05

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బీజేపీకి సినీ గ్లామర్ తక్కువైందనే అభిప్రాయంలో ఉందట. దాంతో సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. భారతీయ గానకోకిల లతా మంగేష్కర్ ను కలిశారు. తాజాగా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో త్వరలోనే అయన బీజేపీలో చేరతారంటూ రూమర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అందుకు బలమైన కారణం ఇటీవల మోహన్ లాల్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకోవడమేనట. పైగా ప్రధాని మోడీతో అయన భేటీ అవ్వడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.