delhi

ముఖ్యమంత్రి ముఖ్య పనులపై...

Submitted by arun on Fri, 08/03/2018 - 14:49

ఢిల్లీకి బయలుదేరే ముఖ్యమంత్రి గారు,

మూడు రోజులు అక్కడే పనులు జోరు,

జోనల్ విధానాలు కోసమడిగే మంజూరు,

ఇక చెయ్యండి అనే విభజన హామీల షురు.శ్రీ.కో

ఢిల్లీలో టవరెక్కిన హోదా

Submitted by arun on Fri, 07/27/2018 - 14:51

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్‌పై ఎక్కిన నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేతిలో బ్యానర్‌ పట్టుకుని నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేశారు.

దేశ రాజధానిలో మరో దారుణం

Submitted by arun on Tue, 07/24/2018 - 12:37

దేశ రాజధాని సమీపంలో మరో కీచక పర్వం వెలుగు చూసింది. ఝాన్సీలో ఓ ప్రేమ జంట‌ను చుట్టుముట్టిన  పోకిరీలు వెకిలి చేష్టలతో వేధించారు. యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఓ పోకిరీ యువతితో బలవంతంగా సెల్పీ కూడా దిగాడు. ప్రేమ జంటపై పోకిరీల వేధింపుల వీడియో వైరల్  కావడంతో పోలీసులు స్పందించారు. ప్రేమ జంటను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

అన్నమయ్య వేషధారణలో టీడీపీ ఎంపీ నిరసన

Submitted by arun on Mon, 07/23/2018 - 12:04

ఏపీకి ప్రత్యేక హోదాపై మాట తప్పిన కేంద్రంపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ తనదైన స్టైల్లో నిరసన వ్యక్తం చేశారు. రకరకాల వేషాలు కట్టి నిరసన వ్యక్తం చేసే శివప్రసాద్ ఈసారి శ్రీవారి పరమ భక్తుడు అన్నమయ్య వేషంలో వచ్చారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోడీ ఆ విషయం మరచిపోయారని శివప్రసాద్ ఆరోపించారు.  కొండలలో నెలకొన్న కోనేటి రాయడి పాటకు పేరడీగా మోడీని ప్రశ్నించే శ్రీవారి భక్తుడిగా మోడీని ప్రశ్నిస్తూ ఓ అన్మమయ్య కీర్తన ఆలపించాడు. ఈ పోరాటానికి అంతా కలిసి రావాలని ఆయన కోరారు.

ఢిల్లీ వేదికగా కేంద్రంపై చంద్రబాబు దాడి

Submitted by arun on Sat, 07/21/2018 - 14:50

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోడీ చెప్పారని ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది తామేనని చంద్రబాబు అన్నారు. 

వెరైటీ దొంగ...డాన్య్ చేస్తూ...

Submitted by arun on Thu, 07/12/2018 - 16:58

ఒకప్పుడు దొంగతనం అంటే దొంగలకు అదో పెద్ద టాస్క్. ఏదైనా కొట్టేయాలంటే ప్లాన్ చేసి పని పూర్తి చేసే దాకా విపరీతమైన టెన్షన్. ఎక్కడ దొరికిపోతామేమోనని భయం. వెళ్లిన చోట ఏదైనా విలువైన వస్తువులు దొరికితే బావుండనే ఆశ. ఇలా చాలా  విషయాల్లో టెన్షన్ పడి అటెన్షన్ పాడవకుండా గుట్టు చప్పుడు లేకుండా పని పూర్తి చేసేవారు. ఇదంతా ఒక తరం దొంగల స్టైల్. ఇప్పుడు దొంగలు మారారు. దొంగతనం చేసే విధానం మారింది. 

ఢిల్లీ డెత్ మిస్టరీలో సంచలన ట్విస్ట్... ఆ ఇంట్లో 11 పైపులు..

Submitted by arun on Mon, 07/02/2018 - 16:31

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వీరంతా ముందుగానే ప్లాన్ చేసుకుని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో లభించిన నోట్స్‌ల ఆధారంగా ఈ ఘోరానికి క్షుద్ర పూజలే అనుమానిస్తుండగా...

పనిమనిషిని అంత దారుణంగా..

Submitted by arun on Sat, 06/30/2018 - 14:24

తనకు ఎన్నో ఏళ్లుగా ఉపాధిని కల్పిస్తూ.. కష్టాల్లో తోడుగా ఉన్న యజమాని పట్ల విశ్వాసం చూపిన ఓ పనిమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఇంటి యజమాని కొడుకు, కోడలు.. దక్షిణ ఢిల్లీలోని పాలమ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తన కొడుకు-కోడలితో కలిసి నివసించేది. అయితే కోడలితో అత్తకి ఎప్పుడూ పడేది కాదు. మద్ధతుగా ఉండాల్సిన కొడుకు కూడా కోడలికే వంత పడటంతో ఆ జంటను ఇంటి నుంచి పంపించేసింది ఆ మహిళ..ఆ తర్వాత కొడుకు తరచూ తల్లిని కలుస్తూ ఉండేవాడు. బుధవారం సాయంత్రం కోడలు మహిళ ఇంటి వద్ద గొడవకు దిగింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో పని మనిషి(45) ఆమెను అడ్డుకునేందుకు యత్నించింది. కోపంతో ఆ కొడుకు-కోడలు పని మనిషిపై దాడికి పాల్పడ్డారు.

బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం....వైరల్‌గా మారిన టీడీపీ ఎంపీల సంభాషణ

Submitted by arun on Fri, 06/29/2018 - 10:57

ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన సంభాషణ ప్రస్తుతం వైరల్‌గా మారింది. మురళీ మోహన్, జెసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, మాగుంట బాబు, కేశినేని నాని, రాంమోహన్ నాయుడు, బుట్టా రేణుక తదితరులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రను కలిసేందకు వెళ్లారు. ఆ తర్వాత వీరంతా ఒక్కచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షపై కూడా కొందరు సెటైర్లు వేశారు. ఎంపీ మురళీ మోహన్.. తాను 5 కేజీలు వరకు తగ్గాలని అనుకుంటున్నానని, వారం రోజుల వరకు దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై స్పందిచిన జేసీ దివాకర్ రెడ్డి, ఒకే డన్ అని అన్నారు.