child-murderer-abhirami-arrest-kanya-kumari

పసిపిల్లల్ని చంపి ప్రియుడితో పరారైన మహిళ.. పోలీసులకు చెప్పిన విషయాలు చూస్తే..

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 16:44

ప్రియుడి మోజులో పడి కన్న కొడుకు, కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలు అభిరామి హత్యకు గల కారణాలు వెల్లడించింది. భర్తను హత్య చేయాలనుకున్నానని, అయితే వీలుకానందున ఇద్దరి పిల్లల్లకు విషమిచ్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించింది చెన్నైకి చెందిన అభిరామి. ఇవాళ(సోమవారం) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. తన భర్త సరిగా ఇంటికి రాడని, తనను రోజు అనుమానించేవాడని  దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని పేర్కొంది. ఇలా ఉండగా తనకు బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది.