hair-treatment-failed-student-commit-suicide-karnataka

వైద్యం వికటించి తలవెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి.. యువతి ఆత్మహత్య

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 12:54

తలవెంట్రుకలు చిక్కుగా ఉన్నాయని కేశ సౌందర్యం కోసం ఓ యువతి చికిత్స చేయించుకుంది. అయితే అది వికటించి వెంట్రుకలు మొత్తం ఊడిపోయాయి. అవమానంగా భావించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కొడగు జిల్లా విరాజపేట మండలం కొట్టిగేరి గ్రామానికి చెందిన నేహా గంగమ్మ (18) బీబీఏ చదువుతోంది. తల వెంట్రుకలు అందంగా ఉండటానికి మైసూరులోని ఓ బ్యూటీ పార్లర్‌లో  ట్రీట్‌మెంట్‌ తీసుకుంది. అయితే ఆ ట్రీట్‌మెంట్‌ వికటించడంతో రెండు నెలల్లోనే ఆమె తల వెంట్రుకలు మొత్తం ఊడిపోయి గుండుగా మారింది.