kannaiah-kumar-contesting-next-lok-sabha-elections

ఎంపీగా పోటీ చేయనున్న కన్నయ్య కుమార్‌.. ఎక్కడినుంచంటే..

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:41

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ విషయాన్నీ బిహార్‌ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్‌ ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు అయన తెలిపారు. సీపీఐ నుంచి కన్నయ్య కుమార్‌ పోటీ చేస్తారని.. ఇప్పటికే వామపక్ష పార్టీలు ఈ నిర్ణయానికి సమ్మతం తెలిపినట్టు అయన వెల్లడించారు. కాగా కన్నయ్య కుమార్‌ బెగుసరై నియోజవర్గానికి చెందిన భీహాట్‌ గ్రామ పంచాయతీకి చెందినవాడు.