uttar pradesh

సిబ్బందితో చెప్పులు తుడిపించుకున్న మంత్రి

Submitted by arun on Fri, 11/16/2018 - 14:16

ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తన సిబ్బందితో చెప్పులు తుడిపించుకోవడం చర్చనీయాంశంగా మారింది. యూపీ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ కుషినగర్ లోని ఓ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది ఎరుపురంగు టవల్ తో శుభ్రం చేశారు. దీన్ని మీడియా ప్రసారం చేయడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుంటి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 

వ్యభిచార నెపంతో కోడలికి అగ్నిపరీక్ష

Submitted by arun on Fri, 10/26/2018 - 12:53

తన కోడలుకు వివాహేతర సంబంధం ఉందని, వ్యభిచారం చేస్తుందనే నెపంతో ఆమెకు అత్తమామలు, భర్త కలిసి అగ్నిపరీక్ష నిర్వహించారు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటు చేసుకుంది. సుమానీ, జైవీర్‌కు గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. కొన్నాళ్ల పాటు సజావుగానే సాగిన వీరి కాపురంలో అనుమానపు చిచ్చు రేగింది. తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ జైవీర్‌ ఆరోపించగా, అతడి తల్లి కూడా అందుకు వంతపాడింది. తాను అలాంటి దాన్ని కాదని కోడలు ఎంతగా మొత్తుకున్నా వినకుండా తాంత్రికుడిని పిలిపించింది. కోడలికి అగ్ని పరీక్ష పెడితే అసలు నిజం బయటపడుతుందని అతడు చెప్పడంతో.. సుమానీ చేతులు కాల్చింది.

ఓట‌రు లిస్టులో సన్నీ లియోన్, పావురం, ఏనుగు ఫోటోలు

Submitted by arun on Sat, 08/25/2018 - 11:24

ఉత్తరప్రదేశ్ ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లాయి. బాలియా జిల్లాలో ఓటర్ లిస్టును అప్‌డేట్ చేసిన తర్వాత ఓ గమ్మత్తు జరిగింది. స్థానిక ఓటర్ల పేర్లతో ఉన్న లిస్టులో.. ఫోటోలు వేరుగా ఉన్నాయి. ఫిల్మ్ హీరోయిన్ సన్నీ లియోన్, పావురాలు, జింకలు, ఏనుగులు కూడా... స్థానికుల ఓటర్ల లిస్టులో దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పట్టణంలో పనిచేస్తున్న ఓ ఆపరేటర్ గ్రామీణ ప్రాంతానికి విధుల నిర్వహణ సందర్భంగా ఈ నిర్వాకం వెలగబెట్టాడని తెలిపారు. సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాబితాను సవరిస్తున్నట్లు పేర్కొన్నారు.

అత్యాచారం చేసి, డ్రైవర్‌తో పెళ్లి చేయించిన బీజేపీ నేత

Submitted by arun on Mon, 07/30/2018 - 12:39

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మీరట్‌లో అధికార బీజేపీకి చెందిన ఓ నేత, తన డ్రైవర్‌తో కలిసి ఓ మహిళపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత కేసు నుంచి తప్పించుకునేందుకు తన డ్రైవర్‌తో ఆ మహిళకు బలవంతంగా వివాహం జరిపించాడు. ఆరు నెలలు ఆమెతో కలిసి ఉన్న ఆ డ్రైవర్ తాజాగా వదిలేయడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ బాధితురాలు. బీజేపీ నాయకుడు విక్కీతనేజా తన డ్రైవరు జైబ్ తో బాధిత మహిళ పెళ్లిని బలవంతంగా చేయించాడు. పెళ్లి అనంతరం ఆరునెలల తర్వాత బీజేపీ నేత డ్రైవరు బాధిత మహిళను వదిలి వెళ్లాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళపై గ్యాంగ్‌ రేప్‌.... ఆపై గుడిలో సజీవ దహనం

Submitted by arun on Mon, 07/16/2018 - 10:15

ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డ దుండగులు ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లా గున్నార్‌ ప్రాంతం పాతక్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. రాజ్‌పుర పోలీసు స్టేషన్‌ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ, ఇద్దరు పిల్లలతో ఉంటుండగా.. ఆమె భర్త ఘజియాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.
 

తాజ్‌మహల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 07/11/2018 - 17:11

తాజ్‌మహల్‌ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్‌ మహల్‌ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది.‘‘తాజ్ మహల్‌ను పునరుద్ధరించండి లేదా కూల్చేయండి. లేకుంటే మేమే తాజ్‌మహల్‌కు తాళం వేయాల్సి ఉంటుంది...’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ మహల్‌ను కాపాడి, పరిరక్షించడంపై స్పష్టమైన విధానాన్నిరూపొందించడంలో విఫలమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపైనా సుప్రీం మండిపడింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మరో దారుణ సంఘటన

Submitted by arun on Fri, 07/06/2018 - 12:18

ఉత్తరప్రదేశ్ లోమరో దారుణం జరిగింది. ఉన్నావ్ లో ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తూ యువతిని బెదిరించారు. అన్నా వదిలేయండి అని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అందమైన అమ్మాయి యువకులను కౌగిలించుకున్నవేళ...

Submitted by arun on Wed, 06/20/2018 - 10:19

రంజాన్ పర్వదినంను ముస్లిం సోదరులు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ పండుగ రోజున ముస్లింలంతా ఒకొరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ రంజాన్ పండుగ ఒక్కటే కాదు చాలా వరకు పండుగలన్నింటికీ ముస్లింలు విషెస్ చెబుతూ ఆలింగనం చేసుకుంటారు. ఇదంతా ఎక్కువగా మసీదులు, నమాజ్ చేసే స్థలాల్లో ఇలా చేస్తుంటారు.

నడి రోడ్డుపై కేంద్రమంత్రికి వేధింపులు

Submitted by arun on Tue, 06/12/2018 - 16:22

ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె... తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

యోగీ వర్సెస్ బాబా రాందేవ్‌

Submitted by arun on Wed, 06/06/2018 - 11:33

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ బాబా రాందేవ్‌ను.. బీజేపీ అగ్రనాయకత్వం కలిసి విజ్ఞప్తి చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మాత్రం యోగా గురుకు ఎదురుదెబ్బ తగిలింది. పతంజలీ సంస్థ సుమారు 6 వేల కోట్లతో గ్రేటర్ నోయిడాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫుడ్ పార్క్‌కు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చే విషయంలో.. జరుగుతున్న తాత్సారంపై రాందేవ్ బాబా.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై అసహనంతో ఉన్నారు. ఎన్నిరోజులైనా విషయం తేల్చకపోవడంతో విసుగుచెందిన రాందేవ్.. చివరకు తన ఫుడ్ పార్క్‌నే తరలించాలని నిర్ణయించారు. ఇటు ఫుడ్‌ పార్క్‌ స్కీమ్‌ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను..