local body elections

పార్టీ ఫిరాయించిన తల్లి.. కసితో ఆమె కుమారుడిని కాల్చిన బీజేపీ నేత!

Submitted by arun on Sat, 09/01/2018 - 11:51

 పశ్చిమ బెంగాల్ లో  దారుణం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫిరాయించి తమను ఇబ్బంది పెట్టిన మహిళపై కోపంతో బీజేపీ నేత ఒకరు ఆమె మూడేళ్ల కుమారుడి తలపై తుపాకీతో కాల్చాడు. పశ్చిమబెంగాల్‌లోని పంచాయితీ బోర్డు ఎన్నికల సందర్భంగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మానిక్‌చాక్‌ డివిజన్‌ పరిధిలోని 18 పంచాయితీల్లో పదింటిని బీజేపీ గెలుచుకుంది. తృణమూల్‌ 6 గెలుచుకోగా, చెరొకటి గెలుచుకున్న సీపీఎం, కాంగ్రె్‌సలు తృణమూల్‌కే మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో బీజేపీ తరపున గెలిచిన పుతుల్‌ మండల్‌ అనే మహిళ సొంతపార్టీకి షాకిస్తూ.. తృణమూల్‌కి మద్దతు ప్రకటించారు. దీంతో డివిజన్ లో ఇరువురి బలాబలాలు 9 సీట్లతో సమానమయ్యాయి.