Congress Campaign Committee

ముందస్తుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం యాక్షన్‌ ప్లాన్‌...రేవంత్‌‌కే బాధ్యతలు ఇచ్చే ఛాన్స్‌

Submitted by arun on Fri, 08/31/2018 - 10:40

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న కమిటీలు సీనియర్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయి. ఆశించిన పదవి దక్కకపోతే కఠిన నిర్ణయాల తీసుకుంటామని వార్నింగ్‌ ఇస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఊహాగానాల మధ్య కాంగ్రెస్‌ అధిష్ఠానం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండేలా తెలంగాణలో పార్టీ యంత్రాంగానికి పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పర్‌ఫెక్ట్‌ డైరెక్షన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.