congress

కాంగ్రెస్‌లో రెడ్డి దర్బార్‌... అత్యధికులు ఆ సామాజికవర్గీయులే!!

Submitted by arun on Tue, 11/13/2018 - 11:29

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో కొన్ని సీమాజిక వర్గాలకు పెద్ద పీట వేయగా మరికొన్ని సామాజిక వర్గాల ఊసే అసలు కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్ ఆచి తూచి సామాజిక వర్గాల వారీగా సీట్లు కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధిక సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయి. మొత్తం 65 స్థానాలకుగాను 23 స్థానాల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం వారు కావడం విశేషం. పైగా ఇందులో ఎక్కువ మంది నల్గొండ జిల్లా వారే కావడం మరో విశేషం. అలాగే 65 మందిలో 10 మంది మహిళలకు అవకాశమిచ్చారు. 

Tags

తొలి జాబితాపై కాంగ్రెస్‌లో రాజుకున్న మంటలు...పార్టీకి రాజీనామా చేసే యోచనలో ...

Submitted by arun on Tue, 11/13/2018 - 11:07

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తొలి జాబితాలో చోటు దక్కని నేతలు అధిష్టాన వైఖరిపై భగ్గుమంటున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా కేటాయించిన స్ధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి స్ధానాన్ని టీడీపీకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచరులతో భేటి అయిన ఆయన పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో వరంగల్ జిల్లాలోనూ అసంతృప్తుల ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వరంగల్ వెస్ట్ సీటును టీడీపీకి కేటాయించడంపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ నేతలకు కాంగ్రెస్ ఝలక్

Submitted by arun on Tue, 11/13/2018 - 10:26

కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకే కాదు...సొంత పార్టీ నేతలకు కూడా ఝలక్ ఇచ్చింది. మొదటి లిస్ట్‌లో సీనియర్ నేతల పేర్లు లేకపోవడం వారిని నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో రెండో జాబితాలో అయినా చోటు దక్కుతుందా..లేదంటే మొత్తానికే మొండి చేయి చూపిస్తారా అనే టెన్షన్‌లో సీనియర్ నేతలు ఉన్నారు. 

కూటమికి కాంగ్రెస్ బారీ షాక్..

Submitted by arun on Tue, 11/13/2018 - 10:01

కళ్లు కాయలు కాసేలా అభ్యర్థులు, నేతలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదలైంది. అయితే మహాకూటమిలో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐలు కోరిన స్థానాల్లో సైతం కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించి.. షాక్ ఇచ్చింది. వరుస భేటీలు, గంటల కొద్ది చర్చలు, మరెన్నో సమాలోచనలు సీట్లపై ఎడతెగని పంచాయతీలు తెలంగాణలో మహా కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవి. చివరకి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అయ్యే వరకు కూడా సీట్ల సర్ధుబాటుపై భాగస్వామ్య పార్టీలకు క్లారిటీ రాని పరిస్థితి. అయితే, ప్రజలు ఎదురుచూసిన కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు విడుదల అయ్యింది.

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి

Submitted by chandram on Mon, 11/12/2018 - 18:02

ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కనిపించే కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం రణక్షేత్రంలా మారింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంతో సీట్ల సర్దుబాట్లు, చర్చలు జరుగుతున్న సమయంలోనే పార్టీ ఆఫీస్‌ దగ్గర మాత్రం సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ను తలపిస్తోంది. నినాదాలు, గొడవలతో దద్దరిల్లుతోంది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా గాంధీభవన్‌కు తాళాలు వేయాల్సి వచ్చింది. గాంధీభవన్‌ దద్దరిల్లుతోంది. ఆశావహుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. టిక్కెట్ల కోసం జరుగుతున్న నిరసనలతో హోరెత్తుతోంది. గత ఐదు రోజుల నుంచి గాంధీభవన్‌ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి.

ఉమ్మడి అజెండాపై మహా కూటమి ఫోకస్‌

Submitted by chandram on Mon, 11/12/2018 - 17:31

అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మహాకూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టారు. ఉమ్మడి అజెండాతోనే కూటమి పార్టీలన్నీ ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఎన్నికల మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌పై చర్చించిన కూటమి పార్టీలు ముసాయిదాపై అంగీకారానికి వచ్చాయి. మరోసారి చర్చించి రేపే ఉమ్మడి అజెండాను ప్రకటించనున్నట్లు కూటమి నేతలు తెలిపారు. సీట్ల సర్దుబాటు అంశం ప్రాథమికంగా ఓ కొలిక్కి రావడంతో కూటమి పార్టీలు ఉమ్మడి అజెండాపై దృష్టిపెట్టాయి.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్...

Submitted by chandram on Mon, 11/12/2018 - 11:17

ఓపక్క మహాకూటమిలో తేలని లెక్కలతో రాహుల్ గాంధీ అసంతృప్తిగా ఉన్నవిషయం తెలిసిందే. కాగా తాజాగా ఛత్తీస్‌గఢ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌కు పార్టీకు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. తొలి దశ ఎన్నికలకు ముందే సాహూ పార్టీ వీడడంతో

పొన్నాలకు హ్యాండిచ్చిన హస్తం పార్టీ

Submitted by arun on Mon, 11/12/2018 - 10:26

కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సీటుకు పొత్తుల్లో భాగంగా ఎసరొచ్చింది. ఇంతకాలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న జనగాం సీటును టీజేఎస్‌కి కట్టబెట్టింది. దీంతో ఆ పార్టీ తరఫున కోదండరాం జనగాం బరిలో దిగనున్నారు. బీసీ నేతగా, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తప్పించి కోదండరాంకు బలవంతంగా అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన జనగాం టికెట్‌పై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్యను తప్పించి కూటమి తరఫున టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు జనగాం సీటు కట్టబెట్టారు. 

వరంగల్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

Submitted by chandram on Sun, 11/11/2018 - 14:22

వరంగల్ అర్బన్‌ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు ఎగిసి పడ్డాయి. వరంగల్ పశ్చిమ టికెట్ నాయిని రాజేందర్ రెడ్డికి ఇవ్వాలంటూ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  హన్మకొండలోని పార్టీ కార్యాలయంగేటుకు తాళాలు వేసి దీక్షకు దిగారు. గ్రేటర్ కాంగ్రెస్  అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు ఇతర కార్యకర్తలు ఆందోళన దిగారు. రాజేందర్‌ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ స్ధానిక ప్రజాప్రతినిధుల వార్నింగ్‌ ఇచ్చారు. కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన సీనియర్ నేతలు బుజ్జగించే పనిల్లో పడ్డారు. 

ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని గాంధీభవన్ ముందు నిరసన

Submitted by chandram on Sat, 11/10/2018 - 16:48

ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ముందు ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఉప్పల్ టికెట్ టీడీపీకి కేటాయించవద్దని ఆందోళన బాటపట్టారు. ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి తన అనుచరులతో గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించడానికి వచ్చిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.