harikrishna

హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి...చితికి నిప్పంటించిన కళ్యాణ్ రామ్

Submitted by arun on Thu, 08/30/2018 - 16:20

అశేష జనవాహిని మధ్య నందమూరి హరికృష్ణ అంతిమ మజిలీ ముగిసింది మెహదీపట్నం మసాబ్ ట్యాంక్‌లోని ఆయన నివాసం నుంచి మహా ప్రస్థానం వరకూ అంతిమయాత్ర సాగింది  హరికృష్ణ అమర్ రహే... జోహార్ హరికృష్ణ అనే నినాదాలు మిన్నంటాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య.. చైతన్య రథసారిథి నందమూరి హరికృష్ణ ఆఖరి మజిలీ ముగిసింది.. 

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు హరికృష్ణ భౌతికకాయాన్ని ఎందుకు తీసుకెళ్లలేదంటే..?

Submitted by arun on Thu, 08/30/2018 - 15:01

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ ముద్దుల తనయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడైన హరికృష్ణ మరణం నందమూరి కుటుంబ సభ్యులనే కాకుండా అభిమానులను కూడా ఎంతో కలచివేసింది. అంతిమ యాత్రలో ఎంతో మంది అభిమానులు పాల్గొన్నారు. అయితే మొదటగా హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అందుకు తగిన ఏర్పాట్లను చేసే క్రమంలో మళ్ళీ వెనక్కి తగ్గడం జరిగింది. కారణం ఇదే...శ్మశాన వాటికకు తీసుకెళ్లే ముందు భౌతికకాయానికి స్నానం చేయించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ కు తీసుకెళ్తే మళ్లీ స్నానం కోసం ఇంటికి తీసుకురావాల్సి ఉంటుంది.

ప్రారంభమైన హరికృష్ణ అంతిమయాత్ర

Submitted by arun on Thu, 08/30/2018 - 14:18

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహం బయటకు తీసుకువచ్చారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్‌, టోలిచౌకి ఫ్లైఓవర్‌, కేఎఫ్‌సీ, అర్చెన్‌ మార్బెల్స్‌, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్‌ స్కూల్‌, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్‌ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 
 

జాతకంలో గ్రహసంచారం బాగా లేదని హెచ్చరించిన సిద్దాంతి

Submitted by arun on Thu, 08/30/2018 - 12:58

హరికృష్ణకు ఇదే తన చివరి ప్రయాణమని ముందే తెలిసిపోయిందా? రథసారథికి తన చివరి డ్రైవింగ్‌ అని ముందే అర్థమైపోయిందా? బుధవారం తెల్లారిజామున నెల్లూరు బయల్దేరే ముందు హరికృష్ణ ఎందుకామాట అన్నారు?

ఆపదలు చెప్పి రావు. కానీ ఆపద రాబోతుందన్న నిజం కొందరికి కొన్నిసార్లు తెలుస్తుంది. తనకు ప్రమాదం జరగబోతుందనో తనకు ఏదో ఆపద రాబోతోందనో అన్న ఆలోచన.. యథాలాపంగా చెప్పుకునే మాటలు కొన్ని సందర్భాలు నిజమవుతుంటాయి. దాన్నే సిక్త్‌సెన్స్‌‌గా చెప్పుకుంటాం. బహుశ నందమూరి హరికృష్ణకు అది తన లాస్ట్‌ జర్నీ ఇదేనన్న విషయం ముందే తెలిసిపోయినట్టుంది. 

వస్తానో రానో.. ఉంటే మాత్రం వస్తా

Submitted by arun on Thu, 08/30/2018 - 12:48

ఆపదలు చెప్పి రావు. కానీ ఆపద రాబోతుందన్న నిజం కొందరికి కొన్నిసార్లు తెలుస్తుంది. తనకు ప్రమాదం జరగబోతుందనో తనకు ఏదో ఆపద రాబోతోందనో అన్న ఆలోచన యథాలాపంగా చెప్పుకునే మాటలు కొన్ని సందర్భాలు నిజమవుతుంటాయి. దాన్నే సిక్త్‌సెన్స్‌‌గా చెప్పుకుంటాం. బహుశ నందమూరి హరికృష్ణకు అది తన లాస్ట్‌ జర్నీ ఇదేనన్న విషయం ముందే తెలిసిపోయినట్టుంది. 

ఆ నెంబర్ నందమూరి ఫ్యామిలీపై పగబట్టిందా..?

Submitted by arun on Thu, 08/30/2018 - 12:21

ఆ నెంబర్ నందమూరి ఫ్యామిలీపై పగబట్టిందా..? సంఖ్యలు మృత్యురూపంలో వారిని వెంబడించాయా..? నాలుగేళ్ల క్రితం ఓసారి.. నేడు మరోసారి నందమూరి వారింటిని శోకసంద్రంలోకి తోసింది ఆ సంఖ్యలేనా..? నెంబర్ సెంటిమెంట్ ఎక్కువగా పాటించే నందమూరి వారసులను వెంటాడిన ఆ సంఖ్యలేంటి...? 

ఆ రెండు కోరికలు...

Submitted by arun on Thu, 08/30/2018 - 11:54

ఇటు రాజకీయాలు.. అటు సినిమాలు. అన్నగారి తర్వాత ఆ రెండు రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి.. హరికృష్ణ. సినిమాల్లో క్యారెక్టర్లకు ప్రాణం పోయడంలోనూ.. తాను అలంకరించిన పదవులకు న్యాయం చేయడంలోనూ.. తనకు తానే సాటిగా నిలిచారు. అలాంటి హరికృష్ణకు సినీ రాజకీయ రంగాల్లో తీరని కోరికలు రెండు మిగిలిపోయాయి.  

నందమూరి ఇంట ‘రహదారి విషాదాలు’ ...మూడు తరాలను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు

Submitted by arun on Thu, 08/30/2018 - 11:39

అతి వేగం ప్రమాదకరం యాక్సిడెంట్‌ వల్ల మేము ఇప్పటికే మా ప్రియ సోదరున్ని కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు అనే మాటలు ఈ మధ్య విడుదలైన నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వచ్చే  వినిపించే స్లోగన్‌. కానీ ఆ అతివేగమే నందమూరి కుటుంబం పాలిట శాపమవుతోంది.తాత  కొడుకు, హరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే వారి ఇంట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. నందమూరి ఫ్యామిలీని మూడు తరాలుగా హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాల పరంపరను ఓ సారి చూడండి.

‘పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ’

Submitted by arun on Thu, 08/30/2018 - 11:25

నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తండ్రికి తగిన తనయుడిగా పెరిగిన హరికృష్ణ మరణం విషాదాన్ని మిగిల్చిందన్నారు వెంకయ్య నాయుడు. హరికృష్ణ ఏ పని చేసినా చిత్తశుద్దితో చేసేవారని.. ఏవిషయంలోనైనా ఏం చెప్పదలకున్నా కుండబద్దలుగా చెప్పేవారన్నారు వెంకయ్య నాయుడు. పార్లమెంట్‌లో తెలుగు భాషలో మాట్లాడిన గొప్పవ్యక్తి హరికృష్ణ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం హరికృష్ణ పార్ధివదేహానికి నివాళులర్పించారు.