congress

కాక మీదున్నా కాంగ్రెస్ నేతలు.. రెబల్స్ గా బరిలో

Submitted by chandram on Sat, 11/17/2018 - 19:40

కాంగ్రెస్ నేతలు కాక మీదున్నారు. సీట్లు దక్కకపోవడంతో అసంతప్తితో రగిలిపోతున్నారు. సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండిచ్చింది. మహాకూటమి అభ్యర్థులకు పోటీగా రెబల్స్ గా బరిలో నిలిచేందుకు నేతలు సిద్ధమయ్యారు. నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం పెద్దలను రంగంలోకి దించబోతుంది. మహాకూటమితో జోరుమీదున్న కాంగ్రెస్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కూటమి పొత్తులో పలువురి కాంగ్రెస్ నేతల సీట్లు గల్లంతయ్యాయి. చివరి వరకు టికెట్ వస్తుందని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. సీటు దక్కించుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు.

అసంతృప్తులపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం

Submitted by arun on Sat, 11/17/2018 - 17:47

రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. రెబల్స్‌గా పోటీ చేయాలని భావిస్తున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు  ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కర్నాటక మంత్రి శివకుమార్, పాండిచ్చేరి సీఎం నారాయణస్వామితో పాటు మంత్రి మల్లాది కృష్ణారావులతో కమిటీని ఏర్పాటు చేశారు. అసంతృప్తులతో స్వయంగా మాట్లాడనున్న కమిటీ సభ్యులు పార్టీకి సహకరించాలని కోరనున్నారు.  రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే కమిటీ సభ్యులు బస చేయనున్నారు. జిల్లాల వారిగా అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన నేతలు కమిటీ సభ్యులకు అందజేశారు. 

రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌!

Submitted by chandram on Sat, 11/17/2018 - 17:34

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను,13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే విడుదలైన మూడో జాబితాలో మాజీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. రేవంత్ వర్గానికి చెందిన అరికెల నర్సారెడ్డిని, సుభాష్‌ రెడ్డిలకు నిజామాబాద్, కామారెడ్డిలో రెండు సీట్లు కేటాయించాలని రేవంత్ పట్టుబట్టిన ఆ సీట్లను సీనియర్ నేతలు ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి రేకుల భూపతిరెడ్డిలకు కట్టబెట్టింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కనేలేదు.

ఉత్తమ్ వల్లే నాకు టికెట్ దక్కలేదు : మర్రి శశిధర్‌రెడ్డి

Submitted by arun on Sat, 11/17/2018 - 16:50

సనత్ నగర్‌ సీటు తనకు రాకపోవడం వెనక కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ తీరు వల్లే తనకు టికెట్ దక్కలేదంటూ ఆయన ఆరోపించారు. సర్వేల పేరుతో తాను గెలవలేనంటూ స్క్రీనింగ్ కమిటీలో వాదించి టికెట్  రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శించారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకే సనత్ నగర్ సీటును టీడీపీ అడగకపోయినా కేటాయించారంటూ మర్రి ఆరోపించారు.  పార్టీ కోసం త్యాగాల చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించిన ఆయన పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనదికాదన్నారు.  పొత్తుల అనంతరం విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాపై మరోసారి ఆలోచించాలని అధిష్టానానికి సూచించారు.

మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్

Submitted by arun on Sat, 11/17/2018 - 11:52

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు చేసినా హైకమాండ్ కనికరించలేదు మూడో లిస్టులో మర్రి పేరును ప్రకటించలేదు. మరోవైపు మర్రిశశిధర్ రెడ్డి ఆశించిన సనత్ నగర్ స్థానంలో టీటీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. సనత్ నగర్ నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్ ను ఎంపిక చేసింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసింది.

కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ఖుష్బూ

Submitted by arun on Sat, 11/17/2018 - 11:19

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రముఖ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ సంచలన ఆరోపణలు చేశారు. బతకమ్మచీరల పేరుతో 222 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన  ఖుష్బూ కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతిభవన్‌లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోవట్లేదని అన్నారు. 

పొన్నాలకే జనగామ టికెట్‌

Submitted by arun on Sat, 11/17/2018 - 10:35

సస్పెన్స్ వీడింది. రాజీ కుదిరింది. జనగామ సీటుతో పాటు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంలో కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి మధ్య తలెత్తిన తగవు సమసిసోయింది. కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి నేతలు హైదరాబాద్‌లో అర్థరాత్రి సాగించిన చర్చలు విజయవంతమయ్యాయి. జనగామ సీటును పొన్నాలకే వదిలేయాలని కోదండరాం నిర్ణయించారు. అలాగే 12 స్థానాల్లో కాకుండా 8 చోట్లే టీజేఎస్ పోటీ చేయడానికి అంగీకరించారు. అలాగే అర్థరాత్రి సాగిన చర్చల్లో నాలుగు పార్టీల కూటమికి ఓ రూపు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక కూటమికి ప్రజా కూటమిగా నామకరణం చేశారు. కూటమి కన్వీనర్‌గా కోదండరాంను నియమించారు.

టీజేఎస్‌కు 8 సీట్లే కేటాయించాం

Submitted by arun on Fri, 11/16/2018 - 16:21

కాంగ్రెస్‌ తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యిందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా తెలిపారు. పొత్తుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చిందని చెప్పిన కుంతియా టీజేఎస్‌కు 8 సీట్లు కేటాయిచినట్టు వివరించారు. కొన్ని స్థానాల్లో మాత్రమే సందిగ్ధత ఉందని.. అది కూడా రేపటిలోగా క్లియర్‌ అవుతుందన్నారు. పొన్నాల సీటుపైనా కుంతియా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో పొన్నాల సీనియర్‌ నాయకుడని సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పొత్తులు కొలిక్కి వచ్చాయని, కాంగ్రెస్‌ 94 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.

మిగిలిన 19 స్థానాలు రేపు ప్రకటిస్తాం: కాంగ్రెస్‌

Submitted by arun on Fri, 11/16/2018 - 15:52

కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా పూర్తిస్థాయిలో ఖరారైందని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజ్‌ తెలిపారు. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటిస్తామన్నారు. ఢిల్లీలో బోస్‌ రాజు విలేకరులతో మాట్లాడుతూ... కోదండరామ్‌తో చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పిన బోస్‌రాజ్‌, సందిగ్ధత ఉన్న నాలుగు స్థానాల్లో ఆశావహులతో రాహుల్‌ చర్చిస్తున్నారని తెలిపారు. బీసీలకు టీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ సీట్లు కేటాయించిందన్నారు. ఇక, సీట్లు దక్కని వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజ్‌ స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మహా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు.