Technology

ఈ నెల 22న వచ్చేస్తున్న రెడ్‌మీ నోట్ 6 ప్రొ

Submitted by nanireddy on Thu, 11/15/2018 - 19:24

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన షియోమీ ఇప్పటికే మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది.  షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. మరుసటి రోజు.. అంటే. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నట్టు షియోమీ సంస్థ తెలిపింది.  షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

భారతీయుల కోసం ఎల్.జీ మరో కొత్త ఫోన్ : ధర పర్లేదు-ఫీచర్స్ అదుర్స్

Submitted by admin on Tue, 09/04/2018 - 18:41

ఇండియన్ మార్కేట్ లో ఎన్ని కొత్త ఫోన్లు వచ్చిన,మరోక దానికి చోటు ఉంటుంది.అవి సక్సెస్ కావాలంటే ఎక్కువ ఫీచర్స్,తక్కువ ధరలో అందిచగలగటమే.ఇదే ప్రయత్నాం చేసింది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఎల్.జీ.ఇప్పటి వరకు ఎన్నో ఫ్లాగ్‌షిప్ ఫీన్ల అందిచిన ఎల్.జీ తన  సరికొత్త స్మార్ట్ ఫోన్ 'ఎల్ జీ క్యూ స్టైలాస్ ప్లస్' పేరిట  సైలెంట్‌గా మార్కేట్ లో విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 6.2 అంగుళాల తెరతో 18:9 రేషియోలో అత్యంత నాణ్యమైన తెరను ఇది కలిగిఉంది.రెండు రకాల రంగుల్లో( మొరాకో బ్లూ, అరోరా బ్లాక్)  రేపటి నుంచి ఈ ఫోన్ అందరికి అందుబాటులో ఉంటుందని ఎల్.జీ తెలిపింది.మంచి ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధరను 21 వే

ఆండ్రాయిడ్ లో తెలియకుండా చేరిన కొత్త నెంబర్ : గూగుల్ క్షమాపణ

Submitted by admin on Sat, 08/04/2018 - 11:18

మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టయితే..ఒక సారి మీ ఫోన్ కీపాడ్ మీద 1947 అనే నెంబర్ టైప్ చేయండి.మీకు ఆటోమాటిక్ గా ఒక కొత్త నెంబరు కనిపిస్తుంది.మీరు సేవ్ చేయకుండానే మీకు కనిపిస్తున్న ఆ నెంబర్ UIDAI సంస్థ టాల్ ఫ్రీ నెంబరు. వేలాది ఫోన్లలో ఎవరు సేవ్ చేయకుండానే ఈ నెంబర్ ఆటోమాటిక్ గా వచ్చి చేరింది.మాకు తెలియకుండా ఇలా ఎలా వస్తుంది ఆండ్రాయిడ్ యుజర్లు చాలా మంది స్క్రీన్ షాట్లు తీసి మరి గూగుల్ కు రిపోర్ట్ చేశారు.విషయాన్ని గమనించిన గూగుల్ అది నిజమేనని,కేవలం అది తమ తప్పిదమేనని ఒప్పుకుంది.దీని వల్ల యుజర్ల భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదని కూడా స్పష్టం చేసింది.

పసిడి కొనుగోళ్లు.. గతేడాదికంటే 15.4 టన్నులు తక్కువ..!

Submitted by admin on Thu, 08/02/2018 - 16:30

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో కూడా భారత్ లో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. ధరల పెరుగుదల, స్థానిక పరిస్థితులు  మార్కెట్ పై ప్రభావం చూపాయి. గతేడాదితో పోల్చుకుంటే ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాదాపు 15.4టన్నల బంగారం కొనుగోళ్లు తగ్గింది. ఈ త్రైమాసికం ఆరంభంలో కొనుగోళ్లు ఉత్సాహంగానే సాగినా.. అధిక మాసం కారణంగా మందగించాయి. ఈ మేరకు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఓ నివేదికలో పేర్కొంది.

ల్యాప్‌టాప్‌ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరలోనే!

Submitted by nanireddy on Tue, 05/08/2018 - 17:59

చదువుకోసమో లేక ఉద్యోగం కోసమో ల్యాప్‌టాప్‌ లు కొనుగోలు చేసేవారికి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఉన్నత ఫీచర్ల లాప్ టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైన ధర పెట్టాల్సిందే. కానీ తాజాగా ఐబాల్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ చూస్తే మతిపోవడం ఖాయం.. ఐబాల్ కాంప్‌బుక్  మెరిట్‌ జీ9 పేరుతో  విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.13,999 లే. 1.1కేజీల అతి తేలికపాటి  బరువుతో..  సెల్‌రాన్‌ ఎన్‌3350 ప్రాసెసర్‌ , మల్టీ ఫంక్షనల్‌ టచ్ ప్యాడ్‌,  ఆరు గంటల బ్యాటరీ సామర్ధ్యంతో కలిగిన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.13,999 లభించడమంటే ఆశ్చ్యర్యమే కదా.. దీని ఓవర్ఆల్ ఫీచర్స్  ఒకసారి చూస్తే..

రెడ్ మీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Submitted by nanireddy on Thu, 05/03/2018 - 11:17

అభిమానులకు షావోమి బాడ్ న్యూస్ చెప్పింది. అనతికాలంలోనే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తానేంటో  ప్రూవ్ చేసుకుంది రెడ్ మీ. భారత్ లోని  మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఫీచర్లతో అతితక్కువ  ధరతో స్మార్ట్ ఫోన్లు, టీవీలు ప్రవేశపెట్టింది. చైనాలో తయారయ్యే ఈ గాడ్జెట్స్ కు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. దాంతో రెడ్ మీ ఉత్పత్తులను ఇండియాలో విస్తరించాలని బుధవారం జరిగిన షావోమి కాన్ఫరెన్స్ లో నిర్ణయించింది. కాగా దీనిపై ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే రెడ్ మీ ఉత్పత్తులైన రెడ్ మీ నోట్ 5 ప్రొ, 55 అంగుళాల ఎంఐ ఎల్‌ఈడీ టీవీ4 ధరలను పెంచేసింది.

గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌‌కి బిగ్‌ అమౌంట్‌

Submitted by arun on Tue, 04/24/2018 - 11:56

గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌ అకౌంట్లో 2వేల 500కోట్లు వచ్చిచేరనున్నాయి. 2015లో కంపెనీ కేటాయించిన 3లక్షల 53వేల 939 నియంత్రిత షేర్లను ఇప్పుడు సుందర్‌ అకౌంట్‌కి బదలాయించింది. ఇప్పుడు వీటి విలువ 380 మిలియన్‌ డాలర్లకు చేరింది. మన ఇండియన్‌ కరెన్సీలో ఇది 2వేల 500కోట్లు. అయితే ఈ షేర్లను నగదుగా మార్చుకునే అవకాశం సుందర్‌ పిచాయ్‌కి లభించనుంది. ఓ కంపెనీ ఉన్నతాధికారిగా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్‌ దక్కించుకుని సుందర్ పిచాయ్‌ రికార్డు సృష్టించారు.
 

ఆన్‌లైన్‌ అంత్యక్రియలు

Submitted by arun on Fri, 04/13/2018 - 12:52

ఆన్‌లైన్ షాపింగ్‌.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. మారుతున్న కాలంతో పాటు వ్యాపారం తీరు మారటం.. తీరిక లేని జీవనశైలీ.. పెరుగుతున్న నెట్ వ్యాపారం.. ఒక్క క్లిక్‌తో ఇంటి నుంచే షాపింగ్‌ చేసే అవకాశం ఇస్తుంది ఆన్‌లైన్‌ బిజినెస్‌. సమయం కూడా కలిసిరావటం.. శ్రమ తగ్గటంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది అంత్యక్రియల కిట్‌. ఆశ్చర్యంగా ఉంది కదూ!... అమెజాన్‌ అందించే ఆ ఆఫర్‌ మీరూ చూడండి.

ఫసిఫిక్ మహాసముద్రంలో కూలిన చైనా స్పేస్ ల్యాబ్

Submitted by arun on Mon, 04/02/2018 - 12:38

అంతరిక్షంలో అదుపుతప్పి తిరుగుతున్న చైనా స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్‌-1 ఫసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. భూ వాతావరణంలోకి వస్తూనే స్పేస్ ల్యాబ్ మండిపోతూ సముద్రంలో పడిపోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఈ స్పేస్ ల్యాబ్ భూమిపై ఎక్కడ పడుతుందోనని ఆందోళన చెందిన వారికి ఈ న్యూస్ ఊరటనిస్తోంది.  8 టన్నుల బరువు గల ఈ స్పేస్‌ ల్యాబ్‌ శకలాలు ఎక్కువ శాతం గాల్లోనే మండిపోయినట్లు తెలిపారు. బీజింగ్‌ సమయం ప్రకారం ఉదయం 8.15నిమిషాలకు దక్షిణ పసిఫిక్‌లోని మధ్య భాగంలో స్కైల్యాబ్‌ శకలాలు పడినట్లు వెల్లడించారు. తియాంగాంగ్‌-1ను 2011 సెప్టెంబర్‌లో ప్రయోగించారు.

మనం.. గూగుల్ గుప్పెట్లో బందీలం

Submitted by arun on Sat, 03/31/2018 - 13:00

5 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్ నుంచి లీకైన ఘటన ప్రకంపనలు ఇప్పటికీ ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఏదో ఒక చోట ఆందోళన రేగుతూనే ఉంది. అయితే మనం నిత్యం వాడుతున్న గూగుల్ తల్లి అంతకంటే డేంజర్.. అని మీకు తెలుసా? మనకు తెలియకుండానే మన సమస్త సమాచారాన్ని దాచిపెట్టుకొనే గూగుల్ గుప్పిట్లో మనం ఎప్పుడో బంధీలమైపోయాం.. మనకు తెలియకుండానే. 

Tags