revanth reddy

కేటీఆర్‌కు రేవంత్‌‌ 10కె రన్ సవాల్

Submitted by arun on Mon, 07/23/2018 - 17:49

పొలిటికల్ ఫిట్‌నెస్‌లో తనతో పోటీ పడే వారెవరూ తెలంగాణలోనే ఎవరూ లేరని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ చేసిన రేవంత్‌ రాజకీయాల్లోనే కాదు ఏ ఆటలో కూడా కేటీఆర్‌ తనతో పోటీ పడలేరని తెలిపారు. కేటీఆర్‌వి అన్నీ పిట్‌ నెస్‌ లేని ఆటలే అని ఎద్దేవా చేశారు. చేతనైతే కేటీఆర్ తనతో 10 కే రన్నింగ్ కు రావాలన్నారు. అప్పడు ఉద్యమ ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారం ముసుగులో పోలీసులతో చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిజామాబాద్‌ జిల్లా రాజకీయాలపై రేవంత్‌రెడ్డి స్పందన

Submitted by arun on Wed, 06/27/2018 - 16:31

నిజామాబాద్‌ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి స్పందించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనని అన్నారు. కవిత కోసం కేసీఆర్‌ తాపత్రయపడుతుంటే, కొడుకుల కోసం డీఎస్‌ ఆరాటపడుతున్నారని అన్నారు. ముందస్తులు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్‌కు విజయవాడలో అమ్మవారు గుర్తుకొచ్చారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌లో బీసీలకు జరిగిన అవమానాలపై మాట్లాడిన దానం నాగేందర్‌... ఇప్పుడు డీఎస్‌కి జరిగిన అవమానంపై స్పందించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తెరపైకి రేవంత్ రెడ్డి పేరు

Submitted by arun on Fri, 06/22/2018 - 13:53

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు హాట్‌హాట్‌గా మారాయి. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధినేత రాహుల్ గాంధీ కొత్త ఫార్ముల తెరపైకి తెచ్చారు. ఇందుకోసం తన విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకున్న ఆయన సామాజిక వర్గాల వారిగా కసరత్తులు  ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములాను సిద్ధం చేసిన ఆయన ఇందుకోసం సమర్ధవంతమైన నేతలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో పాటు ఇప్పటి వరకు సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి స్ధానంలో మల్లు భట్టి విక్రమార్కను నియమించారనే ప్రచారం జరుగుతోంది.  జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి ..

రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకల్లో సూపర్ సీన్...రాహుల్‌కు ఇప్పటివరకు ఎవ్వరూ ఇవ్వని గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

Submitted by arun on Thu, 06/21/2018 - 10:36

కొందరు శాలువాలు కప్పారు.. ఇంకొందరు.. పూలదండలు వేశారు.. మరికొందరు ఫ్లవర్ బొకేలు ఇచ్చారు.. కానీ బర్త్‌డే రోజు రాహుల్ గాంధీకి.. రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్టే నచ్చింది. అందుకే.. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకల్లో సూపర్ సీన్ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా.. అధినేతకు విషెస్ చెప్పేందుకు హస్తినకు వెళ్లారు. అంతా.. శాలువాలు కప్పి.. పూలబొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలోనే.. రాహుల్‌కు విషెస్ చెప్పేందుకు రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఏ నాయకుడూ చేయని సాహసం ఆయన చేశారు. ఇప్పటివరకు రాహుల్‌గాంధీకి ఎవరూ ఇవ్వని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చి..

కుట్రలకు వేదికగా రాజ్‌భవన్: రేవంత్

Submitted by arun on Tue, 03/20/2018 - 17:12

రాజ్‌ భవన్‌ రాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న రేవంత్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారన్నారు.  మోడి ఎజెండాను అమలు చేయడానికి రాజ్‌భవన్‌ను వాడుకుంటున్నారని అందుకు నరసింహన్ పదవీకాలం ముగిసినా అతన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ తో హ‌రీష్ భేటీ - గుట్టుర‌ట్టు చేసిన రేవంత్

Submitted by arun on Sat, 03/10/2018 - 17:23

చచ్చేదాకా టీఆర్ఎస్ లో ఉంటానన్న మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పార్టీ మారుతానని వైఎస్ ను హరీశ్ రావు  కలిసింది నిజం కాదా,  ఈటెలను ఫ్లోర్ లీడర్ చేయడంతో పార్టీ మారేందుకు హరీశ్ రావు సిద్ధపడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అమిత్ షాతో హరీశ్ రావు భేటీ అయింది నిజం కాదా అని నిలదీశారు. కేటీఆర్ ను సీఎంను చేస్తే టీఆర్ఎస్ చీలిపోతుంది అని, చీలిక వర్గానికి హరీశ్ లేదా ఈటెల నాయకత్వం వహిస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పక... టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు అని చెప్పారు.  

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టు విప్పిన రేవంత్‌రెడ్డి

Submitted by arun on Mon, 03/05/2018 - 18:05

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గుట్టును విప్పారు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి. ఇంతకాలం ప్రజా సమస్యలు చూడనట్టు ఇప్పుడే తన దృష్టికి వచ్చినట్టు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తున్నారని రేవంత్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి థర్డ్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన ఆడుతున్న కొత్త డ్రామా అని, ఈ తెర వెనుక భాగోతాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు రేవంత్‌‌రెడ్డి.

రేవంత్‌రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/02/2018 - 13:40

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని మోత్కుపల్లి అన్నారు. ‘టీఆర్‌ఎస్‌తో రేవంత్‌‌రెడ్డికి వైరం ఉండొచ్చు... కానీ నాకు లేదు’ అని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదని ఆరోపించారు మోత్కుపల్లి నర్సింహులు. కమిట్మెంట్ లేనివాళ్లకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు.

రేవంతా మ‌జాకా

Submitted by arun on Sat, 02/24/2018 - 11:02

ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢికొట్టడానికి తన బలాన్ని పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రోత్సహిస్తోంది. ఇందులో బాగంగానే ప్రజాబలం ఉన్న సీనియర్ నేతలకు పార్టీ కండువా కప్పి గాంధిభవన్ కు స్వాగతం పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి టీమ్ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి హస్తం పార్టీ వైపు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇప్పుడు అదే సమస్యగా మారింది.