revanth reddy

రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్‌!

Submitted by chandram on Sat, 11/17/2018 - 17:34

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను,13 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే విడుదలైన మూడో జాబితాలో మాజీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. రేవంత్ వర్గానికి చెందిన అరికెల నర్సారెడ్డిని, సుభాష్‌ రెడ్డిలకు నిజామాబాద్, కామారెడ్డిలో రెండు సీట్లు కేటాయించాలని రేవంత్ పట్టుబట్టిన ఆ సీట్లను సీనియర్ నేతలు ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి రేకుల భూపతిరెడ్డిలకు కట్టబెట్టింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 నియోజకవర్గాలలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కనేలేదు.

ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

Submitted by arun on Sat, 11/17/2018 - 15:39

తన నామినేషన్‌ ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈసీని ఆశ్రయించారు. సీఎం కేసీఆర్ ఒత్తిడితో అధికారులు తన ర్యాలీకి అనుమతి నిరాకరిస్తున్నారంటూ ఆదనపు ఎన్నికల కమిషనర్‌ జ్యోతి బుద్ద ప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. తాను అనుమతి కోరితే శాంతి భద్రతలు అంటున్న అధికారులు ఇతర పార్టీల నేతలకు మాత్రం అడిగిందే తడవుగా అనుమతులు ఇస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలంటూ ఆయన కోరారు.   
 

ప్రచారంలో నోరు అదుపులో పెట్టుకోండి...

Submitted by arun on Sat, 11/10/2018 - 11:16

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 

హరీశ్‌, రేవంత్‌లకు ఈసీ నోటీసులు

Submitted by arun on Fri, 11/09/2018 - 17:09

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. తెలంగాణలోని పలువురు నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేశారనే  ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. మంత్రి హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్, రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

వలసలు చివరికి ఎవరికి ఎసరు...టిక్కెట్ల రేసుతో ప్రశ్నార్థకంగా రేవంత్‌ వర్గం భవిష్యత్తు

Submitted by arun on Tue, 11/06/2018 - 12:23

వాళ్లంతా ఆ నేతను నమ్ముకున్నారు. ఆయన వెంటే నడిచారు. పార్టీలో సముచిత స్ధానం దక్కుతుందని ఆశించారు. టికెట్టు తమకే అనే ధీమాలో ఉన్న ఆ నేతలకు మహాకూటమి పొత్తులు షాక్ ఇస్తున్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంలా మారింది ఆ వలస నేతల పరిస్ధితి. మింగలేక కక్కలేక కొత్తగూడు వెతుక్కునే పనిలో పడ్డారు. 

నాపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయి?...హైకోర్టులో రేవంత్‌‌రెడ్డి పిటిషన్

Submitted by arun on Fri, 11/02/2018 - 14:44

తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో తెలపాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తూ పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ ను చేర్చారు. కాగా రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది.
 

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోంది

Submitted by arun on Sat, 10/27/2018 - 12:52

తెలంగాణ సర్కార్ యువతను గంజాయి, డ్రగ్స్ కు బానిసలుగా చేస్తోందన్నారు టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట‌ రేవంత్ రెడ్డి. క్రీడలు జరిగే గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ జరిగే సెన్సేషన్ రైజ్ ఈవెంట్ ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈవెంట్ పేరుతో లిక్కర్ సరఫరా జరుగబోతోంది ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు మూసుకున్నారా అని రేవంత్ ధ్వజమెత్తారు. ఈవెంట్ పై ఎన్నికల అధికారి రజత్ కుమార్ విచారణకు ఆదేశించాలని కోరారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయలేదు.. కానీ స్టేడియంలో మాత్రం తాగుబోతుల ఈవెంట్ కు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాసేపట్లో ఐటీ ముందుకు రేవంత్‌ రెడ్డి ..

Submitted by arun on Tue, 10/23/2018 - 10:10

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఆదాయపు పన్ను శాఖ విచారణను ఎదుర్కోబోతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకాబోతున్నారు. రేవంత్‌తో పాటు గతంలో విచారణను ఎదుర్కొన్న వారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

టీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ల మధ్య 10 కోట్ల పంచాయతి

Submitted by arun on Sat, 10/13/2018 - 17:44

టీఆర్ఎస్‌ కాంగ్రెస్‌ల మధ్య 10 కోట్ల పంచాయతి ముదురుతోంది. నాయిని వ్యాఖ్యలను సుమోటగా తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తుంటే ఎప్పుడు జరిగిందో తెలుసుకోకుండా ఫిర్యాదులు చేస్తే ఎలాగంటూ టీఆర్ఎస్‌ చురకలు అంటిస్తోంది. టీఆర్ఎస్ నేత నాయినినర్సింహారెడ్డిపై సీఈవో రజత్‌కుమార్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పినట్టుగా నాయిని వ్యాఖ్యానించారని ఫిర్యాదు చేశారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని సీఈవోను రేవంత్‌ కోరారు.

రాహుల్ అనుచరుడు కావాలా...మోడీ జీతగాడు కావాలా..?

Submitted by arun on Mon, 10/08/2018 - 10:29

మోడీ జీతగాడు రాష్ట్రాన్ని పాలించాలా.. లేక, రాహుల్ అనుచరుడు పాలించాలో ప్రజలే ఆలోచించాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆదివారం కుత్బుల్లాపూర్ లో జరిగిన మైనార్టీ సభలో పాల్గొన్న రేవంత్ మోడీని ఓడించాలంటే, ముందు టీఆర్ఎస్ ను ఓడించాలన్నారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రతి ఇంట్లో ఒకరు యుద్దానికి సిద్ధమవ్వాలన్నారు రేవంత్. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే తెలంగాణ సెంటిమెంట్‌ రగిల్చేందుకు చంద్రబాబు నాయుడు పేరుని తెరమీదకు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పీడవిరగడ అవ్వడానికే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.