Crime

గ్రామంలోకి వస్తే చంపేస్తాం.. అడవిలో తలదాచుకుంటున్న ప్రేమజంట

Submitted by nanireddy on Sat, 09/22/2018 - 19:47

ఇటీవల ప్రేమికులపై తీవ్రమైన దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న కారణంగా యువకుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు అనే వ్యాపారి. ఈ ఉదంతం మరవకముందే.. హైదరాబాద్ లో కన్నతండ్రే కూతురిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.. తాజాగా జనగామ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామంలోని పెద్ద మనుషులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటన గుండాల మండలం మరిపడగ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఊరిలోకి వస్తే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గ్రామంలోకి రావొద్దని.. వస్తే చంపేస్తామనడంతో దిక్కుతోచని స్థితిలో ఆ జంట అడవిలో తలదాచుకుంది. 

ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ కీలక నిర్ణయం..

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 07:28

సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే హత్యలో పాలుపంచుకున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బుధవారం పోలీసులు మిర్యాలగూడలోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో తిరునగరు మారుతీరావు, సుభాష్‌శర్మ, అస్గర్‌అలీ, మహ్మద్‌ బారీ, ఎంఏ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్, శివలపై హత్యా నేరం, కుట్ర వంటి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి.

ఆ కారణంతోనే కూతురిపై హత్యాయత్నం

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 19:57

కుల దురహంకారంతోనే పిల్లలపై పెద్దలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ కేసు మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ ఎస్సార్ నగర్ ప్రాంతంలో ఓ యువతి తండ్రి కూతురిపై అత్యంత దారుణంగా దాడి చేశాడు. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాంతో పరువుపోయిందన్న కారణంగా కొబ్బరిబోండాలు నరికే కత్తితో కూతురు, ఆమె భర్తపై దారుణానికి పాల్పడ్డాడు మనోహర చారి. ముందుగా అమ్మాయి తండ్రి ఫోన్‌ చేసి హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు.

వివాహేతర సంబంధం.. వ్యక్తి దారుణ హత్య..

Submitted by nanireddy on Wed, 09/19/2018 - 10:10

పది రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి చివరకు మృతుడిగా మారాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం పోల్కంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (22), చెన్నకేశవులు అనే యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నిరోజులుగా  ఈ విషయంపై వారి మధ్యగొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కాస్త శ్రీకాంత్‌ అనే యువకుడికి తెలిసింది. శ్రీకాంత్‌కు సదరు మహిళ  పిన్ని కావడంతో మొదట నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినా అతడు తీరు మార్చుకోకపోవడంతో చెన్నకేశవులుతో కలిసి అంతమొందించాలని కుట్ర పన్నాడు.

తుపాకీతో బెదిరించి జ్యూవెల్లరీ షాపులో చోరీ

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 19:20

కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ తుపాకీతో బెదిరించి ఓ జ్యూవెల్లరీ షాపులో చోరీకి పాల్పడ్డాడు. దమ్మాయిగూడలోని జ్యూవెల్లరీ షాపులో చొరబడ్డ ఆగంతకుడు ... షాపు యజమానిని గన్‌తో బెదిరించాడు. దొంగతనం అనంతరం రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని తుపాకీతో బెదిరించి బైక్‌తో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జ్యూవెల్లరీ షాపును పరిశీలించి... పరారయిన దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రణయ్ హత్య కేసు : హంతకుడిని పట్టుకున్న పోలీసులు

Submitted by nanireddy on Tue, 09/18/2018 - 19:04

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు హంతకుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ ను చంపింది బీహార్ కు చెందిన సుభాష్ శర్మగా పోలీసులు గుర్తించారు. మారుతీరావు దగ్గర 15 లక్షలు సుపారీ తీసుకుని ప్రణయ్ ను సుభాష్ శర్మ అంతమొందించినట్లు విచారణలో  వెల్లడైంది. ప్రణయ్ హత్య కేసును కుట్రను ఛేదించిన నల్లగొండ పోలీసులు నిందితుడు సుభాష్ శర్మను బీహార్ లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని పాట్నా నుంచి నల్గొండకు తరలిస్తున్నారు. రేపు సుభాష్ శర్మను హైదరాబాద్ తీసుకువచ్చి అక్కడి నుంచి నల్లగొండకు తీసుకెళ్తారని తెలుస్తోంది.

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 19:37

కులదురహంకారానికి బలైపోయిన ప్రణయ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రణయ్ అంత్యక్రియలకు  SC, ST సంఘాల నేతలు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. అంత్యక్రియల సమయంలో అతని కటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. అతని భార్య అమృత, తమ్ముడు అజయ్, తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి వల్ల కాలేదు. ప్రణయ్ ని ప్రాణంగా ప్రేమించిన అమృత..ఇక తన జీవితం భర్త ఆశయాల సాధన కోసం అంకితం చేస్తానని చెబుతోంది. కులం పిచ్చిలో మునిగిపోయిన తండ్రులకు బుద్ధి చెప్పేలా పోరాటం చేస్తానని చెబుతోంది. 

భర్త మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృతవర్షిణి

Submitted by nanireddy on Sun, 09/16/2018 - 10:13

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి భార్య అమృత వర్షిణి బోరున విలపించింది.  ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త  విగతజీవిలా పడివుండటాన్ని చూసిన అమృత వర్షిణి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఆసుపత్రి నుంచి ఆమెను ప్రత్యేక వాహనంలో ప్రణయ్ మృతదేహం వద్దకు తీసుకువచ్చారు పోలీసులు. భర్తను చూసిన అమృత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..  భర్త లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. కాగా ఆదివారం ఉదయం 11గంటకు మిర్యాలగూడలో ప్రణయ్ అంత్యక్రియలు జరగనున్నాయి.   ప్రస్తుతం మిర్యాలగూడలో దళిత సంఘాల ఆందోళనతో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. 

ప్రియుడికోసం పిల్లలను అంతమొందించిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

Submitted by nanireddy on Fri, 09/07/2018 - 18:50

ప్రియుడికోసం కడుపున పుట్టిన పిల్లలను అంతమొందించిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల్ని హత్య చేసి ప్రియుడితో కలిసి కేరళ వెళ్లిపోయిన అభిరామి అనూహ్యంగా పోలీసులకు దొరికింది. ప్రియుడి మోజులో పడి  పిల్లల పట్ల సైకోగా మారినట్టు పోలీసుల విచారణలో అభిరామి ఒప్పుకుంది. బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకోటానని చెప్పింది.

చెట్టుకు ఉరి వేసుకుని యువతియువకుడు ఆత్మహత్య

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 17:11

చెట్టుకు ఉరి వేసుకుని యువతియువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నర్సాపూర్ గ్రామంలో జరిగింది. నర్సాపూర్ గిరిజన తండాకు చెందిన యువతియువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో వాళ్ళు ప్రేమను నిరాకరించిన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలుస్తోంది. అటవీ శివారు ప్రాంతంలోని పొలంలో ప్రేమికులు చెట్టుకి ఉరివేసుకుని మరణించడాన్ని గమనించిన ఓ రైతు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులు నర్సాపూర్ గ్రామానికి చెందిన సెడ్మకి అర్జున్,మాడవి సావిత్రిభాయి లుగా గుర్తించారు.