In-Depth

గణపయ్యను ఎందుకు నిమజ్జనం చేస్తారు? సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి?

Submitted by santosh on Sat, 09/22/2018 - 14:38

గణేశుడ్ని మాత్రమే నిమజ్జనం ఎందుకు చేయాలి? నవరాత్రుల పాటూ పూజించిన తర్వాత ఆఖరుగా నిమజ్జనం చేయడం. దీని అర్ధమేంటి? వినాయకుడ్ని మాత్రమే ఎందుకిలా నిమజ్జనం చేస్తారు? దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది. సమాధానం దొరకని ప్రశ్నగా వెంటాడుతుంది. నిమజ్జనం వచ్చిందంటే చాలు గణపతిబప్పా మోరియా నినాదాలు మిన్నంటుతాయి. వినాయక విగ్రహాలు వూరేగుతూ ఏ చెరువులు గుంటల్లోనూ నిమజ్జనమవుతాయి. అత్యంత పవిత్రంగా విగ్రహాలు పెట్టి.. పూజాధికాలు నిర్వహించి.. గంగలో కలపడం వెనుక అంతరార్ధం ఏంటి?

ఓహో.... రాఫెల్‌ రహస్యం ఇదా!!

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:49

రాఫెల్‌ రహస్యం రట్టయ్యింది. డీల్‌లో మోడీ సర్కారు ఇరుకున పడే విషయం వెలుగుచూసింది. ఇన్నాళ్లూ కుట్ర కోణం ఉందంటూ జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూరింది. రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా ఉన్న రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది.. భారత ప్రభుత్వమే అని.. అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు.. హోలండ్‌ బాంబ్‌ పేల్చారు. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో భారీ స్కామ్‌ జరిగిందంటూ.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారానికి గట్టి ఆయుధం దొరికినట్లైంది. రాఫెల్‌ విమానాల తయారీలో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది.. మోడీ ప్రభుత్వమే అని..

లైన్‌ క్లియర్‌ కావాలంటే రూట్‌ మార్చాల్సిందే! బాబు ప్లాన్‌ ఇదే!!

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:45

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు... ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జు‌లుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి... వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.... పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. 

కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు... అంతా హస్తవ్యస్థం

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:25

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి దుమారం రేపుతోంది. పార్టీ టిక్కెట్ల ప్రకటనకు ముందే అసమ్మతి పార్టీని కలవరపెడుతోంది. అనుబంధ సంఘాల ప్రకటించడంతో ప్రాధాన్యం దక్కని సీనియోర్లు బహిరంగంగా పార్టీపై విమర్శలు చేశారు. లైన్ దాటి వివాదాస్పదంగా మాట్లాడుతున్న వారిని హెచ్చరిస్తూనే షోకాజ్ నోటీసులు జారీచేస్తోంది క్రమశిక్షణ సంఘం. 

కారులో బేజారు... జోరుగా అసమ్మతి హోరు

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:22

గులాబీ గూటిలో అసమ్మతి ముల్లు గుట్టుగా గుచ్చుకుంటుంది. పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా... జిల్లాల్లో అభ్యర్థులకు పోటీగా అసమ్మతులు రంగంలోకి దిగుతున్నారు. టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ అసంతృప్తులు అసలు అభ్యర్థుల కంటే ముందుగా ప్రచారంలోకి దూకుతున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులను మారిస్తేనే కానీ పార్టీ గట్టెక్కదంటూ అధిష్ఠానానికి రహస్య లేఖలు రాయడమే కాదు... బాహాటంగా ఢంకా బజాయిస్తున్నారు. మంత్రుల స్థానాలను మార్చేది లేదన్న అధినేత ఆదేశంతో వారు కాస్త కుదుటగానే ఉన్నా... చాలా నియోజకవర్గాల్లో అసమ్మతులు, అసంతృప్తులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. 

సర్వేలు ఫలితాల్ని తేలుస్తాయా? సింహాసనమెక్కిస్తాయా?

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:13

ఎవరు ఎక్కడ గెలుస్తారు...ఏ అభ్యర్థిపై ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది...సామాజిక సమీకరణల లెక్కలెలా ఉన్నాయి...ప్రత్యర్థి బలమేంటి...బలహీనత ఏంటి..పార్టీ జనాభిప్రాయమేంటి...అంతిమంగా గెలుపు గుర్రమెవరు....ఇలాంటి ఆలోచనలకు సవివరమైన నిర్ధారణకు, సర్వేల బాట పట్టాయి రాజకీయ పార్టీలు. అన్ని ప్రధాన పార్టీలు, సర్వేల జపం చేస్తూ, జన నాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ పోరులో సర్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గెలిచే అభ్యర్థుల కోసం, సర్వేలనే నమ్ముకున్నాయి ప్రధాన పార్టీలు. గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నాయి.

మనసు దోచే యత్నమా? నిజమైన భావోద్వేగమా?

Submitted by santosh on Sat, 09/22/2018 - 11:04

జనాల ఆదరణ చూస్తే భావోద్వేగం. జనహోరును చూస్తే ఆపుకోలేని ఉద్వేగం. అంతులేని అభిమానంతో కట్టలు తెంచుకునే అంతరంగం. ఇంతకంటే ఏం కావాలి, ఈ ఉన్నతమైన దశలోనే నిష్క్రమించాలన్న భావావేశం. ఒక మోడీ, ఒక కేసీఆర్, ఒక వైఎస్‌ఆర్‌. భావోద్వేగ ప్రసంగాలతో జనాన్ని కనికట్టు చేశారు. ఇప్పుడు హరీష్‌‌రావు కూడా, జనాభిమానాన్ని చూసి, భావోద్వేగంతో కదిలిపోయాడు. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు? ఎందుకంత ఎమోషనల్‌ అయ్యారు? ఉద్వేగానికి కారణమేంటి? 

పవన్‌కల్యాణ్‌ ఇంకా.... పార్ట్‌టైమరేనా?

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:42

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా? ప్రభుత్వ అవినీతిపై పోరాడతానంటూ పవన్ కల్యాణ్‌ చేపట్టిన ప్రజా పోరాట యాత్ర‌కు బ్రేకిచ్చి... దాదాపు నెలరోజులు దాటిపోతోంది. కంటి ఆపరేషన్‌తో యాత్రకు విరామిచ్చిన జనసేనాని... మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక జనసేన నేతలు, కార్యకర్తల్లో అమోమయం గందరగోళానికి గురవుతున్నారు. మూడు జిల్లాలు ముగిసేలోపే మూడుసార్లు బ్రేకిచ్చిన పవన్‌... మిగతా జిల్లాల్లో... ఎప్పుడు పోరాట యాత్రను కంప్లీట్‌ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు పోరాట యాత్ర ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు.

ఫైర్‌ బ్రాండ్‌ రాములక్క... ఇప్పుడు కాంగ్రెస్‌ తురుపుముక్క!!

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:34

ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ, తెలంగాణ ఎన్నికల తెరపై ధూంధాం చేసేందుకు సిద్దమయ్యారు. మొన్నటి వరకు అలకపాన్పుపై ఉన్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగించడంతో, ఇక చెలరేగిపోవాలని డిసైడయ్యారు. ఊరూవాడా తిరుగుతూ, కేసీఆర్‌కు దీటుగా విమర్శల బాణాలు సంధించాలని సిద్దమయ్యారు. మరి మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న రాములమ్మ, ఇక తెలంగాణ పోరులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాదు, పొలిటికల్‌ స్క్రీన్‌పైనా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. భావోద్వేగ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. మొదటి నుంచి తెలంగాణ నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

అవునా... కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులున్నారా? హన్మన్న అలా అన్నారేంటి?

Submitted by santosh on Fri, 09/21/2018 - 10:27

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలు, ఆ పార్టీలో నిద్రాణంగా ఉన్న అసంతృప్తి సెగలను రాజేశాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు, నోటికి పని చెప్పారు. ఎన్నికల ముంగిట్లో సమరోత్సాహంతో వెళ్లాల్సిందిపోయి, సంచలన వ్యాఖ్యలతో పార్టీల్లో కల్లోలం రేపుతున్నారు.