Just In

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఖరారు

Submitted by arun on Tue, 09/25/2018 - 10:20

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ మల్లారెడ్డి కేటాయించగా... మల్కాజ్‌గిరి టికెట్‌ మైనంపల్లి హన్మంతరావుకు దక్కింది. ఎమ్మెల్యే టికెట్‌ దక్కడంతో నేడు ఉదయం గుండ్లపోచంపల్లి నుంచి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
 

అరుణ ఆపరేషన్....దాడికి 10 రోజుల క్రితమే...

Submitted by arun on Tue, 09/25/2018 - 10:14

విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల హత్యకు పాల్పడిన మావోయిస్టులను పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా కొందరిని గుర్తించారు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమపై దాడిలో పాల్గొన్న మావోయిస్టుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. దాడికి నేతృత్వం వహించిన అరుణతో పాటు మరో ఇద్దరు మావోయిస్టుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు.

ఎన్నికల ప్రచారంపై టీఆర్ఎస్ బాస్ దృష్టి...అభ్యర్ధులకు ప్రచార సామగ్రి పంపిణీ

Submitted by arun on Tue, 09/25/2018 - 09:57

ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 105 మంది అభ్యర్ధులకు ప్రచార సామగ్రి పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి పర్యవేక్షణలో 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రిని తరలించారు. గ్రామగ్రామాన జరిగే అభ్యర్థుల ప్రచారం, వాహన ర్యాలీలు, బహిరంగ సభలకు అవసరమైన సామాగ్రి అభ్యర్ధులకు చేరింది.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోయిస్టులు వీరే..

Submitted by nanireddy on Mon, 09/24/2018 - 19:26

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య విషయంలో పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ లను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ప్రత్యక్ష సాక్ష్యుల కథనాలతో.. ముగ్గురు నేరుగా దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి ఫోటోలు విడుదల చేశారు. ప్రజా ప్రతినిధులను హత్య చేసింది శ్రీనుబాబు, స్వరూప, అరుణ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా  ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి ప్రభుత్వ లాంచనాలతో ఇద్దరి అంత్యక్రియలు జరిగాయి.

కేరళలో ఎల్లోఅలర్ట్‌.. మళ్లీ భారీ వర్షసూచన...

Submitted by arun on Mon, 09/24/2018 - 17:52

వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ఆ విపత్తు నుంచి తేరుకోకముందే, మరో ముప్పు ముంచుకొచ్చింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, కేరళలోని ఏడు జిల్లాల్లో 64.4 మిల్లీమీటర్ల నుంచి 124.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంవో వెల్లడించింది.

ఉత్తరాదిన రెడ్‌అలర్ట్‌...పంజాబ్‌, హర్యానాలోనూ భారీ వర్షాలు

Submitted by arun on Mon, 09/24/2018 - 17:45

మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. భారీ వరదలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉదృతంగా ఉన్న కులు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. కాంగ్రా జిలాలలోని నహాద్‌ ఖాడ్‌ గ్రామంలో వరద నీటిలో చిక్కుకుని ఓ వ్యక్తి మరణించాడు.

ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై మరో వివాదం..

Submitted by arun on Mon, 09/24/2018 - 17:06

మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం.. ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంపై ప్రణయ్ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. ఏ వర్గానికి వ్యతిరేకంగా ప్రణయ్ విగ్రహఏర్పాటు చేయడం లేదని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకే విగ్రహ నిర్మాణం చేపడుతున్నామని అంటున్నారు. ప్రణయ్ విగ్రహం వ్యవహరంలో రెండు వర్గాలు రోడ్డుఎక్కడంతో మళ్లీ మిర్యాలగూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

3వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన జగన్‌ పాదయాత్ర

Submitted by arun on Mon, 09/24/2018 - 16:23

ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తూ,  ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  మరో అరుదైన మైలురాయిని దాటింది. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలో రావి మొక్క నాటిన జగన్‌ మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పైలాన్‌ ఆశిష్కరించారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తీసుకొచ్చిన కేక్ ను కట్ చేసిన జగన్, తన యాత్రను కొనసాగించారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరకు దాడి...అరుణ నేతృత్వంలోనే అరకు ఆపరేషన్‌

Submitted by arun on Mon, 09/24/2018 - 15:15

ఏవోబీ రాష్ట్ర కమిటీ నేతృత్వంలోనే అరుకు దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న అరుణ.. దాడికి పది రోజుల క్రితమే అరుకు ఏరియాకు వచ్చినట్టు పోలీసులు సమాచారం సేకరించారు. మహిళా దళానికి నేతృత్వం వహిస్తున్న అరుణ... పక్కా వ్యూహంతో దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న అక్కిరాజు హరగోపాల్‌... అలియాస్‌ ఆర్కే ఆదేశాలతోనే ఎమ్మెల్యే సర్వేశ్వర్రావ్, మాజీ ఎమ్మెల్యే సోమలను అరుణ దళం కాల్చి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

Submitted by arun on Mon, 09/24/2018 - 14:36

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్ని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఖండించారు. తాను కరడుగట్టిన టీఆర్ఎస్‌ వాదినని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని వీడేది లేదని హెచ్‌ఎం టీవీతో బొడిగె శోభ స్పష్టం చేశారు. అంతేకాకుండా చొప్పదండి టిక్కెట్‌ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.