Just In

బుల్లితెరకు వచ్చేస్తున్న హీరో విశాల్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:17

తెలుగులో పుట్టి తమిళంలో రాణిస్తున్నవిశాల్ ప్రస్తుతం నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్నాడు.. తాజాగా ఓ షోతో బుల్లితెరను కూడా పలకరించబోతున్నారాయన. తెలుగులో పాపులర్‌ అయిన ‘మేము సైతం’ కార్యక్రమం తరహా షోను తమిళ్‌లో విశాల్‌ హోస్ట్‌ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా విశాల్ హ్యాండిల్ చెయ్యబోతున్న షోను డిజైన్‌ చేయబోతున్నారు. కాగా ఇటీవల 'అభిమన్యుడుతో' తిరుగులేని హిట్‌ కొట్టాడు విశాల్ తెలుగులో డబ్బింగ్‌ సినిమాగా రిలీజైనా కూడా.. ఒక స్ట్రెయిట్‌ సినిమాలా కలెక్షన్లను కొల్లగొట్టింది.

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 20:11

తాను కేవలం సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని అక్షయ్ కుమార్ మరోసారి నిరూపించుకున్నాడు. యాసిడ్ దాడికి గురై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న లక్ష్మి అగర్వాల్‌కి రూ.5 లక్షలు సాయం అందించాడు. ఇటీవల ఆమె గురించి ఓ వార్త పత్రిక ద్వారా తెలుసుకున్న అక్షయ్ కుమార్ సదరు బాధితురాలికి తనవంతు సాయం అందించి.. మరికొందరు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకునేలా మానవత్వాన్ని చూపించాడు. సాయం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్..  'నేను చేసిన సాయం చాలా చిన్నది. దీన్ని ప్రస్తావించడం కూడా నాకు ఇష్టంలేదు. లక్ష్మి గౌరవంగా జాబ్ సంపాదించాలనీ..

ఇప్పుడున్న ATM కార్డులిక మూడు నెలలే.. ఆ తరువాత ఏం చేయాలంటే..

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 19:55

ప్రస్తుతం ఉన్న ఎటిఎం కార్డులు ఇక మూడు నెలలు మాత్రమే పని చేసే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు ఎటిఎం వినియోగదారులు కొత్త ఏటీఎంలకు అప్లై చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఇండియా(RBI) తెలుపుతోంది. అంతేకాదు ఇక మీదట EMV ( యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా ) చిప్ బేస్డ్ కార్డులే వాడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే RBI ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) తన కస్టమర్ల కార్డులు మార్చుకోవాలని సందేశాలు పంపుతోంది. ఈ కొత్త EMV కార్డుల మీద ఎడమవైపు యాక్సెస్ చిప్ ఉంటుంది.

వారిని చూడాలని కోరుకుంటున్న మాధవి

Submitted by nanireddy on Thu, 09/20/2018 - 19:44

ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తండ్రిలో చేతిలో పాశవికంగా దాడికి గురైన మాధవి ప్రస్తుతం క్షేమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నా క్రమంగా కోలుకుంటోందని అన్నారు.  కాగా మాధవి తన తల్లి, తమ్ముడిని చూడాలనుకుంటున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ తెలియజేశారు.   కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

మాధవి బతికి వస్తే చాలంటున్న సందీప్

Submitted by arun on Thu, 09/20/2018 - 17:37

తండ్రి చేసిన క్రూరమైన దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా హైదరాబాద్ ఎర్రగడ్డలో నిన్న మనోహరాచారి చేసిన దాడిలో మాధవి మెడ, చేతిపై బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ప్రస్తుతం అపస్మారస్థితిలో ఉన్న మాధవి మృత్యువుతో పోరాడుతోంది.

నిజామాబాద్‌ రూరల్ బరిలో మండవ..?...కాంగ్రెస్ ఆశావాహుల్లో టెన్షన్

Submitted by arun on Thu, 09/20/2018 - 17:33

ఆ సీటు కోసం ఒకరు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మరొకరు ఎమ్మెల్సీగా ఉంటూ అధికార పార్టీని వీడి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సంకల్పంతో హస్తం గూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న మరో ఇద్దరు ముగ్గురు నేతలు ఆ టికెట్టు ఆశతో కష్టాల్లోనూ కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలను అంచనాలను తారుమారు చేస్తూ పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీ కోరుకుంటోంది. మాజీ మంత్రి మండవను బరిలోకి దింపాలని భావిస్తోంది. దాంతో కాంగ్రెస్‌ ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు

Submitted by arun on Thu, 09/20/2018 - 17:11

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం దగ్గర నుంచి వంద హామీలను కేసీఆర్ ఇచ్చారని... ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి, ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లా మాట తప్పే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారని విమర్శించారు. కేసీఆర్, టీఆర్ఎస్ పతనం నల్గొండ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.
 

తెలంగాణ ఇచ్చే విష‌యంలో కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ు

Submitted by arun on Thu, 09/20/2018 - 16:53

తెలంగాణ ఇచ్చే విష‌యంలో తాము ఎక్క‌డా కేసీఆర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ అన్నారు.  తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత‌గానో పోరాడార‌ని అనేక సార్లు అరెస్ట్ అయ్యార‌ని ఆజాద్ తెలిపారు. పార్టీ ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింద‌ని ఆజాద్ వివ‌రించారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌... ఈ నాలుగేళ్లలో ఖాళాగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులనే భర్తీ చేయలేకపోయారని, ఇంక కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని ఆజాద్‌ ఎద్దేవా చేశారు.

ఈ ఘటనంతటికీ తన భార్యే కారణమన్న మనోహరాచారి

Submitted by arun on Thu, 09/20/2018 - 16:33

ప్రేమ పెళ్ళి చేసుకుందని హైదరాబాద్ లో కూతురిపై కత్తితో దాడి చేసిన మనోహరాచారిని కోర్టుకు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళారు. కూతురిపై పాశవికంగా దాడి చేసిన మనోహరాచారిని రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. కోర్టుకు తరలించే సందర్భంగా మనోహరాచారిని మీడియా చుట్టిముట్టింది. అతనిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే తొందరపడి తప్పు చేశానని మనోహరాచారి అంగీకరించాడు. తన ఉద్దేశం ఎవర్నీ చంపడం కాదనీ..బెదిరించడమేననీ చెప్పుకొచ్చాడు. చావు బతుకుల్లో ఉన్న తన కూతురు మాధవి బతకాలని మనోహరాచారి కోరుకున్నాడు.